Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Eci Announces Advance Registration For 17years Old Youth To Enroll Their Name In Voters List

Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం

Published Date :July 28, 2022 , 3:12 pm
By Mahesh Jakki
Voter ID:17 ఏళ్లకే ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఈసీ కీలక నిర్ణయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Voter ID: మనదేశంలో ఓటర్ జాబితా పేరు నమోదు చేసుకుని ఓటరు కార్డు పొందాలంటే 18 ఏళ్లు నిండే వరకు వేచి చూడాల్సిందే. ఇకపై ఓటరు కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఉన్న కనీస వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లుపైబడిన యువత ఓటరు జాబితాలో పేరు నమోదుకు ముందస్తుగా దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రజల్లో అవగాహన కల్పించాలని వెల్లడించింది. ఇప్పటి వరకు జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయస్సు గల వారు మాత్రమే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. తాజాగా ఈసీ తీసుకున్న నిర్ణయంతో 17 ఏళ్ల వారందరికీ అవకాశం లభించినట్లయింది.

జనవరి 1వ తేదీ ఎప్పుడొస్తుందా అని వేచి చూడకుండా 17 ఏళ్ల వయసు దాటిన వారు ఓటర్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో యువత పేర్ల నమోదుకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌తోపాటు ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్రపాండే ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ముందస్తు ఓటరు నమోదుకు అవసరమైన సాంకేతికతను అందుబాటులో ఉంచాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Command Control Room Live : కమాండ్ కంట్రోల్ రూమ్ సిటీకి మూడో కన్ను కానుందా.?

ఇప్పటివరకు యువత జనవరి నెలలోనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉండేది. ఇక నుంచి ఏడాదికి నాలుగు సార్లు అవకాశం ఇచ్చారు. యువత కేవలం జనవరిలోనే కాకుండా ఏప్రిల్‌ 1, జులై 1, అక్టోబర్‌ 1వ తేదీల్లో ఓటర్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రతి త్రైమాసికానికి ఓటరు జాబితాను అప్‌డేట్ చేస్తారు. ప్రతి త్రైమాసికానికి అంటే.. ఇకపై మూడు నెలలకు ఒకసారి ఓటర్‌ జాబితాను అప్‌డేట్ చేస్తారు. 2023లో జనవరి 1 లేదా ఏప్రిల్‌ 1 లేదా జులై 1 లేదా అక్టోబర్‌ 1 నాటికి… 18 ఏళ్లు నిండే ప్రతి ఒక్కరు అడ్వాన్స్‌గా ఓటర్‌ కార్డు కోసం ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆర్‌పీ యాక్ట్‌ 1950లోని సెక్షన్‌ 14బీ, రిజిస్ట్రేషన్ ఆఫ్‌ ఎలక్టోర్స్ రూల్స్‌, 1960 చట్టాల్లో న్యాయశాఖ మార్పులు చేసింది. దరఖాస్తు ఫారాలను కూడా మరింత సులభతరంగా ఎన్నికల సంఘం మార్చనుంది. కొత్త దరఖాస్తు ఫారాలు 2022, ఆగస్టు 1వ తేదీ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అయితే.. ఆలోపు పాత దరఖాస్తుల్లో వివరాలు అందించిన వారికి అనుమతిస్తారు. ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించేందుకు ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. దీనికోసం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదని.. స్పచ్ఛందం మాత్రమేనని స్పష్టం చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 17years old youth to enroll
  • ECI
  • election commission
  • Election Commission of India
  • enrollment of voter card

తాజావార్తలు

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..

  • Dunkin: భారత్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం.. కారణం ఇదే..

  • DC vs MI IPL 2026: రిజ్వీ విధ్వంసం.. ముంబై ఓటమి..

  • India-Iran Relations: హార్ముజ్ దాటిన మరో ఎల్పీజీ ట్యాంకర్.. భారత్‌కు ‘‘విశిష్ట స్థానం’’ ఉందని ఇరాన్ సందేశం..

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions