మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్)కి కేంద్ర ఎన్నికల సంఘం ఊరటనిచ్చే కబురు చెప్పింది. ప్రజల నుంచి విరాళాలను స్వీకరించడానికి శరద పవార్ పార్టీకి అనుమతించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను స్వీకరించేందుకు ఈసీ అనుమతి కోరింది. దీనికి భారత ఎన్నికల సంఘం ఆమోదించింది. సుప్రియా సూలే నేతృత్వంలోని 8 మంది సభ్యులు సోమవారం కమిషన్ కలిసింది. వ్యక్తి లేదా కంపెనీ నుంచి స్వచ్చంధంగా విరాళాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Karnataka: ప్రేమను తిరస్కరించాడని 3 నెలల పసికందును చంపిన యువతి..
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శరద పవార్ పార్టీ సత్తా చాటింది. ఇండియా కూటమి 30 స్థానాలు గెలుకుచుకుంటే.. శరద పవార్ పార్టీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. ఇండియా కూటమి కూటమి 17 స్థానాలు మాత్రం సొంతం చేసుకుంది. త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఇండియా కూటమి భావిస్తోంది. ఇందుకోసం భారీగా కసరత్తు చేస్తోంది. అలాగే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారధ్వంలోని ఎన్డీఏ కూటమి కూడా మరోసారి అధికారం ఛేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చదవండి: Undavalli Arun Kumar: తెలంగాణకు నష్టం లేకుండా ఏపీకి మంచి చేయండి..