Site icon NTV Telugu

Voter ID Cards: ఓటర్ ఐడీ కార్డులపై కీలక ప్రకటన చేసిన ఈసీ

Voter Id Cards

Voter Id Cards

ఓటర్ ఐడీ కార్డుల జారీపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ఓటర్ గుర్తింపు కార్డులు 15 రోజుల్లో అందజేయాలని ఆదేశాలు ఇచ్చింది. కొత్త కార్డు లేదా అప్‌డేట్ కార్డులను 15 రోజుల్లోనే ఇవ్వాలని సూచించింది. ప్రస్తుతం ఎలక్టర్ ఫొటో గుర్తింపు కార్డు అందజేయడానికి నెల కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఈసారి మాత్రం ఈపీఐసీ స్థితిని ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా ఓటర్లకు తెలియజేయనున్నారు. సమాచారం అందజేస్తూనే 15 రోజుల్లోనే కార్డును అందజేయనున్నారు.

ఇది కూడా చదవండి: Sundeep Kishan: హీరో సందీప్ కిషన్ ఇంట తీవ్ర విషాదం..

ఈ కొత్త విధానం కొత్తగా వివరాలు నమోదు చేసుకున్న వారికి. ఓటరు వివరాల్లో మార్పులు చేసుకున్న వారికి ఈ విధానం వర్తిస్తుందని ఈసీ పేర్కొంది. 15 రోజుల్లోపు ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కొత్త వ్యవస్థ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ద్వారా EPIC జనరేషన్ నుంచి పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ (DoP) ద్వారా ఓటరుకు కార్డు డెలివరీ అయ్యే వరకు ప్రతి దశను రియల్-టైమ్ ట్రాకింగ్ చేస్తుందని పోల్ అథారిటీ తెలిపింది.

ఇది కూడా చదవండి: Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు!

త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయి. ఇక కొత్త సంవత్సరంలో తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇక బీహార్‌లో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ప్రారంభించాయి.

Exit mobile version