Site icon NTV Telugu

Earthquake: హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం.. వణికిన ప్రజలు

Earthquakebihar

Earthquakebihar

భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న హిమాచల్‌ప్రదేశ్‌ను తాజాగా భూకంపం వణికించింది. చంబా ప్రాంతంలో వరుసగా రెండు సార్లు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వరుస విపత్తులతో హడలెత్తిపోతున్నారు.

ఇది కూడా చదవండి: Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్‌ల కుట్ర

బుధవారం తెల్లవారుజామున చంబా జిల్లాలో రెండు సార్లు భూకంపం సంభవించింది. ఉదయం 4:39 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం నమోదైంది. గంట తర్వాత అదే ప్రాంతంలో 3.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. రెండు ప్రకంపనలు వరుసగా 10 కి.మీ, 20 కి.మీ లోతుతో సంభవించాయి.

ఇది కూడా చదవండి: Shocking : కేపీహెచ్‌బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

ఓ వైపు హిమాచల్‌ప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతుండగానే తాజాగా రెండు సార్లు భూకంపం సంభవించడంతో ప్రజలు వణికిపోయారు. అయితే భూకంపాలు కారణంగా ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు అధికారులు ఏమీ వెల్లడించలేదు. ఇక జూన్ 20 నుంచి రుతుపవనాలు కారణంగా సంభవించిన వరదలు కారణంగా 276 మంది చనిపోయారు. వీరిలో 143 మంది కొండచరియలు విరిగిపడి, ఆకస్మిక వరదలు కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 133 మంది అసురక్షిత పరిస్థితుల కారణంగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లో కూడా 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. 170 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా పేర్కొంది. మంగళవారం తెల్లవారుజామున కూడా ఇస్లామాబాద్, రావల్పిండి, ఖైబర్ పఖ్తుంఖ్వా, స్వాత్, చిత్రాల్, అబోటాబాద్‌లోని అనేక ప్రాంతాలలో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్థాన్‌లోని అనేక జిల్లాల్లో భూకంపాలు సంభవించాయి.

Exit mobile version