NTV Telugu Site icon

Earthquake: ఢిల్లీలో భూకంపం.. పరుగులు పెట్టిన ప్రజలు..

Earth Quick

Earth Quick

Earthquake: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్లు పేర్కొనింది. ఈరోజు (ఫిబ్రవరి 17) ఉదయం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెప్పుకొచ్చారు. దీంతో ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.

Read Also: Health Tips: మకాడమియా నట్స్ తిన్నారా..? లేకుంటే బోలెడన్నీ ప్రయోజనాలు మిస్ అయినట్లే

ఇక, ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది అని స్థానికులు తెలిపారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలో మీటర్లు మాత్రమేనని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇక, అయితే, గత నెల జనవరి 23న చైనాలోని జిన్జియాంగ్‌ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత ఢిల్లీలో బలమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి.