NTV Telugu Site icon

EAM S. Jaishankar: ముంబై దాడులతో పుల్వామా, ఉరీ దాడులను పోల్చి చూడండి..

Jai Shankar

Jai Shankar

EAM S. Jaishankar Comments on india’s foreign policies:భారత విదేశాంగ విధానం గురించి విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మంగళవారం అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించారు. నేను ఏం చేస్తున్నానో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు. విదేశాంగ శాఖ మంత్రిగా యూఎస్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు ప్రయాణిస్తున్నానని మీరు చదివి ఉంటారు..కానీ నేను ఏం చేస్తానో, ఓ విదేశాంగ మంత్రి ఏం చేస్తాడో ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.

విదేశాంగ మంత్రిగా నేను భారత్ ను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు ప్రపంచాన్ని భారతదేశానికి తీసుకురావడం నా పని అని అన్నారు. ప్రపంచం ఇప్పుడు భారత్ మాట వినేందుకు సిద్ధంగా ఉందని.. మోదీ ప్రభుత్వం 10 రోజులు, 10 నెలుల, 10 ఏళ్లకు సంబంధించిన విదేశాంగ విధానాలను కలిగి ఉందని జైశంకర్ అన్నారు. మోదీ విదేశాంగ విధానంలో మూడు అంశాలు ఉన్నాయని.. భద్రత, అభివృద్ధి, ప్రజల సంక్షేమం అని ఆయన అన్నారు.

Read Also: JaiRam Ramesh Face to Face Live: రాహుల్ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా

నేడు ప్రపంచంలో మారుతున్న అమెరికాను, కొత్త అమెరికాను చూస్తున్నామని.. అలాగే చైనా ఎదుగుదల ఈ రెండు ముఖ్యమైన పరిణామాలు అని ఆయన అన్నారు. విదేశాంగ విధానం, దౌత్యం అనేవి దేశం బయటి విషయాలుగా చూడొద్దని, ఇవి రోజూవారీ మన జీవితంలో భాగమని జైశంకర్ అన్నారు. భారతదేశ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడూ ఉగ్రవాద బాధితురాలే అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు అది మారిపోయిందని.. మీరు 2008లో ముంబై దాడులతో ఉరీ, పుల్వామా దాడులను పోల్చి చూస్తే మా ప్రభుత్వ విధానాలపై ఎంత నమ్మకం ఉందో మీరు గమనించవచ్చని అన్నారు. చెప్పకనే సర్జికల్ స్ట్రైక్స్ గురించి, పాకిస్తాన్ దెబ్బతీసిన విధానాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.