EAM Jaishankar: ఐరాస 80వ వార్షికోత్సవం నేపథ్యంలో పోస్టల్ స్టాంపు విడుదల చేసిన సందర్భంగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. ఐక్యరాజ్య సమితి నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాని నిర్ణయాలు ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించలేకపోతున్నాయని పేర్కొన్నారు. వివాదాల యుగంలో శాంతి అనేది అవసరం.. ప్రస్తుతం ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్తుంది.. ఈ క్రమంలో యూఎన్‌లో అంతా సరిగ్గా లేదన్నారు. ఐక్యరాజ్య సమితిలో అర్థవంతమైన సంస్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. ఇది అత్యవసరమైనప్పటికీ.. మార్పులు జరిగేలా ఆ సంస్కరణలు ఉండాలని తెలిపారు. యూఎన్ కు భారత్ ఎప్పుడూ బలమైన మద్దతుదారుగానే ఉంటుంది.. కానీ.. ఐరాస నిర్ణయాలు దాని సభ్యత్వాన్ని, ప్రపంచ ప్రాధాన్యాలను ప్రతిబింబించడం లేదన్నారు.
Read Also: Virat Kohli: క్రికెట్కు కోహ్లీ గుడ్ బై.. ఘాటుగా స్పందించిన సునీల్ గవాస్కర్..
అలాగే, మైనారిటీల రక్షణకు, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులు కాపాడేందుకు భారత్ సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని ఐరాస మానవ హక్కుల కమిషన్ ప్రస్తుత ఛైర్మన్‌గా ఉన్న స్విట్జర్లాండ్ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలకు భారత్ దీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశం జాత్యహంకారం, క్రమబద్ధమైన వివక్ష, విదేశీయులపై నెట్టడం మంచి పద్దతి కాదని పేర్కొనింది. ముందు తమ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టిపెట్టాలని సూచించింది. మరోవైపు.. పహల్గాంలో పౌరులపై జరిగిన ఉగ్రదాడిని వరల్డ్ వైడ్ గా ఖండించినప్పటికీ.. పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదని విమర్శించారు.
Read Also: PM Modi: విపక్ష కూటమిలో ఉన్నవారంతా నేరస్థులే.. బీహార్ ర్యాలీలో మోడీ ధ్వజం
ఇక, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పదే పదే కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు భారత్‌పై నిందలు మోపేందుకు ప్రయత్నాలు చేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఇలాంటి తప్పుడు వార్తలను మేము ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నట్లు చెప్పారు. అలాగే, ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా చిత్రీకరించేందుకు యూఎన్ సమావేశాల్లో పాక్ దౌత్యవేత్తలు ప్రయత్నం చేయడాన్ని భారత్ తీవ్రంగా తప్పబట్టింది.
