NTV Telugu Site icon

Delhi: మంగళవారం ప్రధాని మోడీ గిఫ్ట్‌లు వేలం.. విలువ ఎంతంటే..!

Pmmodidelhi

Pmmodidelhi

ప్రధాని మోడీ మంగళవారం 74వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఇందుకోసం దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోడీకి వచ్చిన బహుమతులను సెప్టెంబర్ 17న వేలం వేయనున్నాయి. ఈ మేరకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Jani Master Wife: జానీ మాస్టర్ భార్య కూడా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి!

600 బహుమతులు వేలం వేయనున్నట్లు కేంద్రం తెలిపింది. స్పోర్ట్స్‌ షూ మొదలు వెండి వీణ, రామమందిరం ప్రతిమ వంటి గిఫ్టులు వేలానికి ఉంచనున్నారు. రూ.600 నుంచి రూ.8.26 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. అన్నింటి విలువ దాదాపు రూ.1.5 కోట్లుగా అంచనా వేస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Renewable Energy Investors Meet-2024: గ్రీన్ ఎనర్జీ విప్లవం రాబోతోంది: సీఎం చంద్రబాబు

ఈ గిఫ్టులను ఈ-వేలం ద్వారా అమ్మనున్నారు. ఈ-వేలం మంగళవారం ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నమామి గంగే నిధికి విరాళాలు అందజేస్తూ ఈ-వేలంలో ప్రజలు పాల్గొనాలని కేంద్రమంత్రి కోరారు. ఈ ఏడాది ఆరో విడత వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బహుమతులు వేలం వేయడం 2019లో ప్రారంభించబడింది. ప్రజలు మంగళవారం నుంచి తమకు ఇష్టమైన మెమెంటో కోసం ఈ వేలంలో పాల్గొనవచ్చు. ఆన్‌లైన్ వేలం అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రక్రియలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులు అధికారిక వెబ్‌సైట్ https://pmmementos.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చు మరియు పాల్గొనవచ్చు. దాదాపు ఆరు వందల మెమెంటోలను వేలం కోసం ఉంచారు. వీటిలో విశిష్ట కళాఖండాలు, చక్కగా రూపొందించిన ఆలయ నమూనాలు, హిందూ దేవతలు మరియు పారాలింపియన్ల బూట్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Balapur Ganesh Laddu: బాలాపూర్ లడ్డూ వేలంలో ఈసారి కొత్త రూల్..

Show comments