CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.

  • ఢిల్లీ వర్సిటీ ఫలితాలపై CJP నేత సౌరవ్ దాస్ స్పందన
  • ప్రతిపక్ష ఓట్లు చీలడంతో ABVPకి ప్రయోజనం కలిగిందని వ్యాఖ్య
  • ఎన్నికల్లో గెలిచిన వారు ‘రాజులు, రాణులు కాదు’ అంటూ దాస్ వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ తన రాజకీయ వ్యూహాన్ని సరిదిద్దుకోవాలని సూచన
Cjp's Saurav Das

Cjp's Saurav Das

CJP: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల ఫలితాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు సౌరవ్ దాస్ స్పందించారు. ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ABVP గెలించిందని అన్నారు. ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా మెజారిటీ విద్యార్థులు ఉన్నప్పటికీ, ఓటు విభజన కారణంగా ఫలితాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన వారు ‘‘రాజులు లేదా రాణులు కాదు’’ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సౌరవ్ దాస్ అన్నారు. మెజారిటీ విద్యార్థులు వారికి ఓటు వేయలేదని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ దాని సంస్థాగత విభాగాలు సీజేపీపై దృష్టి పెట్టడం కన్నా తమ రాజకీయ వ్యూహాన్ని సరిదిద్దుకోవాలని సూచించారు. ఈ మార్పు ప్రక్రియ 12 ఏళ్లుగా కొనసాగుతోందని, ప్రజలు సహనం కోల్పోతున్నారని అన్నారు. NSUI టికెట్ దక్కకపోవడంతో స్వతంత్రంగా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా భారీ మెజారిటీతో గెలిచిన దీపాంశు షోకీన్‌ను ఉదాహరణగా సౌరవ్ దాస్ ప్రస్తావించారు. లెఫ్ట్ పార్టీల్లో కొన్ని వర్గాలు ‘‘సైద్ధాంతిక స్వచ్ఛత, ప్రత్యేకత’’పై దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇదే తరహాలో ఉంటే, ఐక్యంగా లేకపోతే, వారు ప్రతిపక్షంలోనే కొనసాగాల్సి వస్తుందని అన్నారు.

DUSU ఎన్నికల్లో ABVP నాలుగు కేంద్ర పదవుల్లో మూడింటిని గెలుచుకుంది. యశ్ దబాస్ అధ్యక్షుడిగా, రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకీన్ వైస్ ప్రెసిడెంట్‌గా విజయం సాధించారు. ఈ విజయం బీజేపీలో జోష్ నింపాయి. ఏబీవీపీ అభ్యర్థుల విజయంపై కేంద్రమంత్రులు, బీజేపీ లీడర్లు అభినందనలు తెలియజేస్తున్నారు.