Drunk Man: మందుబాబులం మేం మందుబాబులం అంటే చాలు గబ్బర్ సింగ్ మూవీ గుర్తుకు రావాల్సిందే.. అందులో కోటా శ్రీనివాస్ రావు పోలీస్టేషన్ లో చేసే హడావుడి ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తాగుబోతులంటే ఎందుకంత చులకన అంటూ వేసే స్టేప్పులతో ఆసాంగ్ కు సినిమా హాల్ లో విజల్స్ తో దద్దరిల్లింది. అలాంటి తరహాలోనే బీహార్ లోని నలందా పోలీస్ స్టేషన్ లో ఓతాగుబోతు వీరంగం సృష్టించాడు. మద్యపాన నిషేధం ఉన్నా తాగుతున్నాడని ఆ..మందుబాబును పోలీసులు అదుపులో తీసుకున్నారు.
అతడిని పోలీస్టేషన్ కు తీసుకురాగా మత్తులో వున్న ఆవ్యక్తి పోలీసులకు చుక్కలు చూపించాడు. వందేమాతరం పాడుతూ స్టేషన్ లోనే మార్చ్ ఫాస్ట్ చేస్తూ.. పోలీసులు తలపట్టుకునేలా చేశాడు. అతడి అదుపు చేయలేక పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈవీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈవీడియో చూసిన వాళ్లు మందుబాబా మజాకా అంటూ.. దేశమంటే ఎంత ప్రేమ మందులో వుండి కూడా వందేమాతం ఆలపించాడు అంటూ మరికొందరు.. మందుబాబులంటే ఎవరికైనా చుక్కలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
