Shocking Video: మత్తులో మనిషి ఏమి చేయగలడో అతని ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడే తెలుస్తుంది. ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ తాగుబోతు మత్తులో కొండచిలువను తీసుకుని మెడకు చుట్టుకున్నాడు. ఈ ఘటన జార్ఖండ్‌లోని గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరిహార పంచాయతీ కితాసోటి ఖుర్ద్ గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూంది. 55 ఏళ్ల బిర్జాలాల్ రామ్ భుయాన్.. అన్నరాజ్ డ్యామ్ నుండి వచ్చాడు కాలువ లోతులేని నీటిలో చేపలు పట్టడానికి వెళ్ళాడు.
Read also: Minister KTR: మీడియా ‘మోడీయా’గా మారింది.. ఎప్పుడూ ఆ వార్తలేనా?
అయితే అతడి కళ్లు కొండచిలువపై పడడంతో పామును పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. ఇక్కడే కథ అడ్డంతిరిగింది. మెల్లగా అతిని మెడకు బిగించడం ప్రారంభించింది కొండసిలువ. దీంతో వదిలించుకునేందుకు మెడలో వేసుకుని తాండవం చేయసాగాడు. బీర్జాలాల్ తన ప్రాణాలను రక్షించమని అరవడం ప్రారంభించాడు. బీర్జాలాల్ కు సమాచారం అందడంతో అక్కడకు చేరుకుని తన స్నేహితుల సహాయంతో 15-20 నిమిషాల పాటు పోరాడి కొండచిలువను తొలగించి తండ్రి ప్రాణాలను కాపాడాడు. అయితే కిందపడటంతో ఆ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
