Site icon NTV Telugu

Drunk Man: తప్పతాగి 30 అడుగుల డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. వీడియో వైరల్..

Uttar Pradesh

Uttar Pradesh

Drunk Man: ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో ఓ తాగుబోతు పోలీసులకు సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 30 అడుగుల పొడవున్న డ్రైయినేజీ పైపులో చిక్కుకుపోయాడు. అతడిని రక్షించేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు స్థానికుల సాయంతో రక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. లక్షకు పైగా వ్యూస్ రాగా, 8 వేల లైక్స్ వచ్చాయి. పోలీసులను నెటిజన్లు ప్రశంసించారు.

Read Also: Lucknow: లక్నోలో దారుణం.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భార్యను చంపి, దొచుకెళ్లిన దుండగులు..

తాగిన మత్తులో ఓ వ్యక్తి డ్రైనేజీలో పడిపోయాడు. . డ్రెయిన్‌పైప్ లోపల నుండి సహాయం కోసం వ్యక్తి కేకలు విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం డ్రైనేజ్ పైపులోని ప్రవేశించి, వ్యక్తిని బయటకు తీసుకువచ్చేందుకు మార్గం క్లియర్ చేశారు. కొన్ని నిమిషాల తర్వాత వారు అతడిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 30 అడుగుల పొడవున్న వేగంగా ప్రవహించే డ్రైన్‌పైప్‌లో పడిపోయిన మత్తులో ఉన్న వ్యక్తి గురించి తెల్లవారుజామున 112 కాల్‌కు వచ్చిందని, నోయిడా పోలీసులు తర్వగా సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సాయంతో అతడిని విజయవంతంగా రక్షించినట్లు పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

Exit mobile version