Site icon NTV Telugu

మోత మోగుతున్న డ్ర‌మ్‌స్టిక్స్‌…

కొంత‌కాలంగా కురుస్తున్న వ‌ర్షాల‌కు కూర‌గాయ‌లు ధ‌ర‌లు అమాంతంగా పెరిగాయి.  కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెరిగిపోవ‌డంతో వినియోగ‌దారులు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు.  పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో కాయ‌గూర‌ల ధ‌ర‌లు కొండెక్కాయి.  ఇప్ప‌టికే ట‌మోటా వంద‌కు పైగా ప‌లుకుతుంటే, ఆలు రూ. 40 కి పైగా ప‌లుకుతున్న‌ది.  అయితే, ఇప్ప‌డు ఆ బాట‌లో మున‌క్కాయ‌లు కూడా చేరాయి.  

Read: సీడీఎస్ బిపిన్ రావ‌త్ క‌న్నుమూత‌… ధృవీక‌రించిన ఆర్మీ…

క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర మార్కెట్‌లో కిలో 400ల‌కు పైగా ప‌లుకుతున్న‌ది. వ‌ర్షాల కార‌ణంగా మార్కెట్లో మున‌క్కాయ‌లు అందుబాటులో లేక‌పోవ‌డంతో పూణే నుంచి తెప్పిస్తున్నారు.  ఎంత ధ‌ర అయినా కొనేందుకు సిద్దంగా ఉన్నామ‌ని, పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో మున‌క్కాయ‌ల‌కు డిమాండ్ అధికంగా ఉంద‌ని చిక్‌బ‌ళ్లాపుర మార్కెట్ యాజ‌మాన్యం చెబుతున్న‌ది. 

Exit mobile version