Site icon NTV Telugu

Delhi: ఎయిర్‌పోర్టులో రూ.10 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. కేటుగాడు ఎక్కడ దాచాడంటే..!

Drugs

Drugs

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుపట్టింది. రూ.10 కోట్ల విలువైన 10 కేజీల ఫారిన్ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులకు ఏ మాత్రం అనుమానం రాకుండా గంజాయిని నల్లటి పాలిథిన్ కవర్స్‌లో ప్యాకింగ్ చేసి ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచాడు. ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో ఏకంగా 20 గంజాయి ప్యాకెట్లను కేటుగాడు అమర్చాడు. అయితే కస్టమ్స్ అధికారులు నిర్వహించిన స్క్రీనింగ్‌లో బండారం బయటపడింది. దీంతో బ్యాంకాక్‌కు చెందిన ప్రయాణికుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Infinix Smart 9 HD: ఇన్‌ఫినిక్స్‌ నుంచి మరో కొత్త ఫోన్.. రూ.6,699 మాత్రమే!

Exit mobile version