Drugs Smuggling: బెంగళూర్ లో భారీ స్థాయిలో పట్టుబడ్డ డ్రగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజుకు ఎక్కడో చోట డ్రగ్స్ పట్టుబడుతూనే ఉన్నాయి. ఇటీవల కేరళ తీరంలో దాదాపుగా రూ. 1500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూర్ అంతర్జాతీయ కార్గోలో పెద్ద ఎత్తున భారీగా ఎఫిడ్రీన్ పట్టివేశారు. 90 లక్షల విలువైన 5 కేజీల డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్తున్న పార్సిల్ లో ఈ డ్రగ్స్ ను దాచిపెట్టి అక్రమ రవాణా చేయాలని చూశారు.
కస్టమ్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా రెడీమేడ్ దస్తుల్లో డ్రగ్స్ ను దాచి తరలించే యత్నం చేశారు. పక్కా సమాచారంతో అంతర్జాతీయ కొరియర్ టర్మినల్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆస్ట్రేలియా కు ఎగుమతి చేయడానికి సిద్దంగా ఉన్న పార్శిల్ ను పరిశీలించిన కస్టమ్ అధికారులకు రెడీమేడ్ దుస్తుల్లో దాచిన డ్రగ్స్ ను పట్టుకున్నారు. ఆధార్ కార్డులను మార్ఫింగ్ చేసి పార్సిల్ రూపంలో డ్రగ్స్ తరలింపుకు ప్లాన్ చేశారు కేటుగాళ్లు.
Also Read
అయితే బెంగళూర్ లో పట్టుబడిన డ్రగ్స్ కు ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైలో గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఆధార్ కార్డును తన ఫోటో తో మార్ఫింగ్ చేసి, డ్రగ్స్ ఎగుమతి చేయడానికి యత్నం చేశారు. విజయవాడలోని కొరియర్ ఏజెన్సీని సంప్రదించిన వ్యక్తిని అరెస్టు చేశారు కస్టమ్స్ అధికారులు. కాగా వీరి వెనుక ఎవరు ఉన్నారనే వివరాలను రాబడుతున్నారు అధికారులు.
ఇటీవల ఇదే విధంగా ఎయిర్ పోర్టులు వేదికగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న క్రమంలో నిందితులు పట్టుబడ్డారు. బెంగళూర్, చెన్నై, ట్రిచి ఎయిర్ పోర్టుల్లో ఒకే సారి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
-
Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
-
Story Board: కులం ప్లస్ రాజకీయం.. ఏపీలో ఎప్పుడూ ఇదే కాంబినేషన్..!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!