Site icon NTV Telugu

చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసులో డ్రగ్స్‌ కలకలం..

drugs at chennai

చెన్నై అంతర్జాతీయ పోస్టాఫీసులో ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అమెరికా, నెదర్లాండ్స్ నుండి చెన్నై వచ్చిన మూడు పార్శిల్ లో డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మూడు పార్శిల్ లో డ్రగ్స్ దాచి కేటుగాళ్లు పోస్టాఫీసు ద్వారా చెన్నై చిరునామాకు పంపించారు.

పార్శిల్స్ స్కానింగ్ లో డ్రగ్స్ సరఫరా తతంగం బయటపడింది. పార్శిల్ పంపిన అమెరికా, నెదర్లాండ్స్ చిరునామాలపై కస్టమ్స్ బృందం ఆరా తీస్తుంది. ఈ మేరకు డ్రగ్స్, గంజాయిని సీజ్‌ చేసి ఎన్‌డీపీఎస్‌ 1985 యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. పార్శిల్ పై వున్న చెన్నై చిరునామాలో అధికారులు దాడులు నిర్వహించనున్నారు.

Exit mobile version