Site icon NTV Telugu

Delhi: ఢిల్లీలో దారుణం.. నలుగురు కుటుంబ సభ్యులను చంపిన ఉన్మాది..

Palam Incident

Palam Incident

Drug addict stabs four members of his family to death: ఢిల్లీలో దారుణం జరిగింది. సొంత కుటుంబానికి చెందిన నలుగురిని కత్తితో దారుణంగా పొడిచి చంపాడు ఓ ఉన్మాది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని పాలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో తల్లి, తండ్రి, సోదరి, అమ్మమ్మ ఉన్నారు. డ్రగ్స్ కు బానిసైన కేశవ్(25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులతో పాటు, సోదరి, అమ్మమ్మను హత్య చేశాడు. కొన్ని రోజలు క్రితమే కేశవ్ డ్రగ్స్ అడిక్షన్ సెంటర్ నుంచి తిరిగి వచ్చాడు. నిందితుడు అతని మొత్తం కుటుంబాన్ని చంపాడు. ఈ ఘటన జరిగిన తర్వాత అతని ఇతర బంధువుల పట్టుకునే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు.

Read Also: China Fire Accident: చైనాలో భారీ అగ్ని ప్రమాదం.. 38మంది సజీవ దహనం

ఈ ఘటనలో నిందితుడు కేశవ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పదునైన ఆయుధంతో బాధితుల గొంతు కోసి, పలుమార్లు పొడిచి చంపినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిని దినేష్ కుమార్ (42), దర్శన్ సైనీ (40), ఊర్వశి (22), దీవానో దేవి (75)గా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు గంట వ్యవధిలో నలుగురిని హత్య చేసినట్లు తెలిసింది. మొదటగా తండ్రిని ఆ తరువాత అమ్మమ్మని హత్య చేసి బాత్ రూములో దాచాడు. ఆ తరువాత తల్లిని, ఉద్యోగం నుంచి తిరిగి వచ్చిన తర్వాత సోదరిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు కారణం కుటుంబ కలహాలే అని తెలుస్తోంది. తరుచుగా ఇంట్లో వాళ్లు తనను డ్రగ్ అడిక్ట్ అని తిడుతుండటంతోనే కుటుంబాన్ని చంపేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version