NTV Telugu Site icon

IIT Students Dropouts: ఐఐటీల్లోనూ డ్రాపౌట్స్.. ఐదేళ్లల్లో 8 వేల మంది

Iit Students Dropouts

Iit Students Dropouts

IIT Students Dropouts: దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీల్లో చేరాలంటే విద్యార్ధులు ఎంతో కష్టపడి చదవాలి. ఐఐటీల్లో సీటు సంపాదించడం కోసం కోచింగ్‌లను సైతం తీసుకుంటారు. అలాంటి ఐఐటీల్లో సీటు పొందిన తరువాత విద్యార్థులు మధ్యలోనే డ్రాపౌట్‌ అవుతున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ సంఖ్య పెరుగుతున్నట్టు ఘణాంకాలు చూస్తే తెలుస్తోంది. ఐఐటీల్లో చేరిన విద్యార్థుల్లో కొందరు ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఐదేళ్లల్లో ఐఐటీల్లో సుమారు 8 వేల మంది విద్యార్థలు డ్రాపౌట్‌ అయినట్టు కేంద్రం ప్రకటించింది.

Read also: Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ మళ్లీ వాయిదా

2019 నుంచి 2023 మధ్యలో దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశం పొందేందుకు ఏటా వేల మంది విద్యార్థులు పోటీపడుతుంటారు. అయితే గత ఐదేండ్లలో ఏకంగా 8 వేల మందికిపైగా విద్యార్థులు ఐఐటీల నుంచి డ్రాపౌట్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్ఈ మేరకు రాతపూర్వక సమాధానమిచ్చారు. మొత్తంగా కేంద్ర ఉన్నత విద్యాసంస్థల నుంచి 32 వేల మందికిపైగా విద్యార్థులు డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి 17,454 మంది, ఐఐటీల్లో 8,139, ఎన్ఐటీల్లో 5,623, ఐఐఎస్ఈఆర్‌ నుంచి 1046, ఐఐఎంల నుంచి 858 మంది డ్రాపౌట్ అయినట్టు చెప్పారు. మొత్తంగా 2019 నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ఈ సంఖ్య 32 వేలుగా ఉందని వెల్లడించారు. వీరిలో 52 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారేనని తెలిపారు.

Read also: Nassar: పవన్ కళ్యాణ్ చెప్పింది తప్పు.. అలాంటి రూల్స్ ఏం లేవు

గత ఐదేండ్లలో ఐఐటీల్లో 39 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. మొత్తంగా ఉన్నత విద్యాసంస్థల్లో 98 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. వారిలో 39 మంది ఐఐటీల్లో, 25 మంది ఎన్ఐటీల్లో, 25 మంది కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, నలుగురు ఐఐఎంల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం.. ఒంటరిగా ఫీలవడం, హింస, కుటుంబ సమస్యలు, మానసిక రుగ్మతలు తదితర కారణాల వల్ల విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినట్టు కేంద్ర మంత్రి తెలిపారు.