కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నా.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉందనే హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో వ్యాక్సినేషన్, ఇతర మందులపై అందరి దృష్టి ఉంటుంది… ఇక, ఇదే సమయంలో డీఆర్డీవో రూపొందించిన 2 జీడీ ఔషధాన్ని ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం.. దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సప్లై చేస్తోంది.. పొడి రూపంలో ఉండీ ఈ ఔషధాన్ని ఎలా వాడాలి..? ఎవరు? వాడాలి.. తదితర అంశాలపై గైడ్‌లైన్స్ విడుదల చేసింది డీఆర్జీవో.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందిఏ..
ఇక, డీఆర్జీవో విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సాధ్యమైనంత త్వరగా డాక్టర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది.. గరిష్ఠంగా 10 రోజుల పాటు దీనిని వాడొచ్చు అని పేర్కొంది..
-నియంత్రణ లేని డయాబెటిస్, తీవ్రమైన గుండె జబ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించి చూడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
-2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు పేషెంట్లకు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
- 2DG@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను 2డీజీ ఔషధం సప్లై చేయాలని పేషెంట్లు, వాళ్ల అటెండర్లు ఆయా హాస్పిటల్స్‌ను కోరవచ్చు అని కూడా గైడ్‌లైన్స్‌లో పేర్కొంది డీఆర్జీవో.