NTV Telugu Site icon

Amarnath Yatra 2023: అమర్ నాథ్ యాత్రికులు ఈ ఫుడ్ తినకుండా బ్యాన్..

Amarnath Yatra 2023

Amarnath Yatra 2023

Amarnath Yatra 2023: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరో నెలరోజుల్లో ప్రారంభం అవ్వనుంది. అమర్‌నాథ్ యాత్ర 2023 జూలై 1న ప్రారంభమవుతుంది మరియు 31 ఆగస్టు 2023 వరకు కొనసాగుతుంది. ఈ యాత్ర 62 రోజుల పాటు కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లో పరమేశ్వరుడి మంచులింగం దర్శనం కోసం కాలినడకన 14 కిలోమీటర్లు సవాళ్లతో కూడిన యాత్రను కొనసాగించాల్సి ఉంటుంది. యాత్రికులు 14,000 అడుగుల ఎత్తుకు చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాత్రికులు అనేక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవాలి. ఈ నేపథ్యంలో శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB), యాత్రికుల కోసం ఆరోగ్య సలహాను జారీ చేసింది. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను నిషేధించింది.

నిషేధించబడిన ఆహార పదార్థాలు ఇవే:
* అన్ని మాంసాహార ఆహారాలు, హెవీ పులావ్ / ఫ్రైడ్ రైస్.
*దోశ, పూరీ, బతూరే, పరాఠా,
* ఊరగాయలు, పచ్చళ్లు, ఫ్రైడ్ పాపడ్
* పిజ్జాలు, బర్గర్స్, క్రీమ్ తో తయారయ్యే ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్
* హల్వా, జిలేబీ, గులాబ్ జామున్, లడ్డు ఖోయా బర్ఫీ, రసగుల్లా
* ఫ్యాట్-ఉప్పు ఎక్కువగా ఉండే చిప్ప్, పకోరా, సమోసా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్
* కూల్ డ్రింక్స్
* ఆల్కాహాల్, పొగాకు, గుట్కా, పాన్ మాసాల
యాత్రా మార్గంలోని అన్ని దుఖాణాల్లో, ఫుడ్ స్టాల్స్ లో ఈ ఆహార పదార్థాలు ఉంచవద్దని ఎస్ఏఎస్బీ ఆదేశాలు జారీ చేసింది.

అనుమతించిన ఆహార పదార్థాలు:
* తృణధాన్యాలు, పప్పులు, సాగ్, బీసన్ కర్రీ, సాదా పప్పు
* గ్రీన్ వెజిటేబుల్స్, బంగాళదుంపలు, సోయా ముక్కలు, గ్రీన్ సలాడ్, పండ్లు, మొలకలు సాదా బియ్యం, జీరా రైస్, ఖిచ్డీ మరియు న్యూట్రేలా రైస్.
* రోటీ / ఫుల్కా, దాల్ రోటీ, మిస్సీ రోటీ, మక్కీ కి రోటీ (వేయించని, నూనె/వెన్న లేకుండా), తందూరి రోటీ, బ్రెడ్/కుల్చా / డబుల్ రోటీ
* రస్క్, చాక్లెట్, బిస్కెట్లు, కాల్చిన చనా మరియు బెల్లం
* సాంబార్, ఇడ్లీ, ఉత్తపం, పోహా మరియు ధోక్లా.
* వెజిటబుల్ శాండ్‌విచ్ (క్రీమ్/వెన్న లేకుండా జున్ను), బ్రెడ్ జామ్, కాశ్మీరీ నాన్ (గిర్దా) , ఆవిరితో ఉడికించిన వెజిటబుల్ మోమోస్
* కాల్చిన పాపడ్, ఖఖ్రా, ఫులియన్ మఖానా, ముర్మరా.
* తేనె, అత్తి పండ్లను, ఎండుద్రాక్ష, ఆప్రికాట్లు మరియు ఇతర డ్రై ఫ్రూట్స్
* హెర్బల్ టీ, తక్కువ కొవ్వులు ఉండే పాలు, పండ్ల రసం, వెజిటెబుల్ సూప్, మినరల్ వాటర్

వాటితో పాటు రోజుకు 5 లీటర్ల నీరు తాగాలి. ఆల్కాహాల్, కెఫిన్, సిగరెట్ల వంటివి మానేయ్యాలి. కార్బోహైడ్రెడ్లను పుష్కలంగా తీసుకోవాలి.

Show comments