Site icon NTV Telugu

కరోనా థర్డ్‌ వేవ్… ఎయిమ్స్‌ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

Randeep Guleria

Randeep Guleria

భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్ రణదీప్ గులేరియా… దేశంలో థర్డ్ వేవ్‌ వస్తుందనడానికి ఆధారాలు లేవని వెల్లడించిన ఆయన.. కోవిడ్‌ మూడో దశలో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తల్లోనూ నిజం లేదంటున్నారు. సెకండ్‌ వేవ్‌లోనూ పిల్లలపై కరోనా ప్రభావం చూపించిందని.. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న పిల్లలకే మహమ్మారి సోకిందని గుర్తుచేశారు.. మరోవైపు ఇదే అంశంపై క్లారిటీ ఇచ్చారు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్‌.. థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్రభావం చూపుతుంద‌న‌డానికి ఎలాంటి ఆధారాలు లేవ‌ని స్పష్టం చేసిన ఆయన.. ప్రత్యేకంగా పిల్లల‌పైనే ప్రభావం చూపే వేవ్ ఉంటుంద‌న్నదానిపై స్పష్టత లేదన్నారు.. ఇప్పటి వ‌ర‌కూ క‌రోనా అటు పెద్దలు, ఇటు పిల్లల‌పై ఒకే ర‌క‌మైన ప్రభావం చూపిందని గుర్తుచేశారు… కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన సెరోప్రివ‌లెన్స్ డేటా ఇదే స్పష్టం చేసిందన్న ఆయన.. వ్యక్తుల బ్లడ్ సీరంలో ఉండే వ్యాధి కార‌కాల స్థాయిని తెలిపేదే ఈ సెరోప్రివ‌లెన్స్‌. ఇది పెద్దలు, పిల్లల్లో ఒకేలా ఉన్నట్లు వీకే పాల్ వెల్లడించారు.

Exit mobile version