Site icon NTV Telugu

డామినోస్ బంప‌ర్ ఆఫ‌ర్‌: ఆమెకు జీవితాంతం పిజ్జా ఫ్రీ…

టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియా క్రీడాకారులు రాణిస్తున్నారు.   49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఇండియా తొలి ప‌త‌కం సాధించింది.  మీరాభాయ్ చాను ర‌జ‌త ప‌త‌కం సాధించారు.  త‌న‌కు పిజ్జా అంటే చాలా ఇష్టం అని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా… పిజ్జా తింటానా అని ఉంద‌ని చెప్పుకొచ్చారు.  అయితే, మీరాభాయ్ చాను కు ప్ర‌ముఖ పిజ్జా కంపెనీ డామినోస్ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.  ఆమెకు జీవితాంతం ఉచితంగా పిజ్జాను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.  టోక్యో ఒలంపిక్స్‌లో భార‌త క్రీడాకారులు అనుకున్న‌దానికంటే మెరుగ్గా రాణిస్తున్నారు.  ఇప్ప‌టికే మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్‌లో ర‌జ‌తం సాధించ‌గా, రెజ్లింగ్ కేట‌గిరిలో ప్రియాంక మాలిక్ స్వ‌ర్ణం సాధించారు.  

Read: త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీక?

Exit mobile version