MLA Umang Singhar: 10 కోట్లు ఇవ్వకపోతే.. అత్యాచారం కేసు పెడతానంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Domestic Violence Case On Congress MLA Umang Singhar: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్‌పై అత్యాచారంతో పాటు గృహహింస కేసు నమోదైంది. తాను ఉమంగ్ భార్య అని చెప్పుకుంటున్న ఓ మహిళ (38) ఫిర్యాదు మేరకు.. ఆదివారం సాయంత్రం ఆయనపై ధర్ సిటీలోని నౌగావ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉమంగ్ తనతో అసహజ శృంగారానికి పాల్పడుతున్నారని.. తాను వద్దని ఎంత మొరపెట్టుకున్నా విడిచిపెట్టకుండా తరచూ లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయాలన్ని బయటకు చెప్తే, చంపేస్తానని ఉమంగ్ బెదిరించారని.. అందుకే ఇన్నాళ్లూ వేధింపుల్ని సహిస్తూ వచ్చానని తెలిపింది.
అయితే.. ఆ మహిళ చేసిన ఆరోపణల్ని ఉమర్ సింఘార్ తోసిపుచ్చారు. ఇది ఒక కుట్ర అని, డర్టీ పాలిటిక్స్‌లో భాగమని చెప్పారు. ఆ మహిళ తనని మానసిక వేధింపులకు గురి చేస్తోందని.. రూ. 10 కోట్లు ఇవ్వకపోతే, తనపై అత్యాచార కేసు పెడతానని బ్లాక్మెయిల్ చేస్తూ వస్తోందని ఆయన పేర్కొన్నారు. దీనిపై తాను నవంబర్ 2వ తేదీనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదని వాపోయారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు. ఈ కేసుపై మరో కాంగ్రెస్ నేత కేకే మిశ్రా స్పందిస్తూ.. తనకు ఈ కేసు గురించి పూర్తిగా అవగాహన లేదని, కానీ పైపెచ్చు ఇది రాజకీయ కుట్రగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మాత్రం.. ఉమంగ్కి గతంలోనూ ఇతర భార్య ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.
Also Read
కాగా.. ఆదివాసీ వర్గంలో శక్తిమంతమైన రాజకీయ నేతగా పేరుగాంచిన ఉమంగ్, ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారులో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. తన సహజీవన భాగస్వామి సోనియా భరద్వాజ్ ఆత్మహత్యలో.. ఉమంగ్ ప్రమేయం ఉందని ఆయనపై ఓ కేసు ఉంది. దీంతోపాటు ఇతర నేరారోపణలు కూడా ఉమంగ్పై ఉన్నాయి.
తాజావార్తలు
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!