NTV Telugu Site icon

QR code for LPG Cylinders: ఎల్పీజీ సిలిండర్లకు త్వరలో క్యూఆర్ కోడ్..

Qr Code For Lpg Cylinders

Qr Code For Lpg Cylinders

Domestic LPG cylinders to come with QR codes soon: ఎల్పీజీ సిలిండర్లు త్వరలో క్యూఆర్ లతో వస్తాయని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి బుధవారం తెలిపారు. ఈ కోడ్ ఆధారంగా సిలిండర్లను ట్రాకింగ్, ట్రేసింగ్ సులభం అవుతుందని ఆయన అన్నారు. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిర్వహించడానికి ఈ క్యూఆర్ కోడ్ విధానం సహకరిస్తుందని వెల్లడించారు. సిలిండర్ల నిర్వహణ కూడా బాగుంటుందని ఆయన అన్నారు.

Read Also: Danushka Gunathilaka: లైంగిక దాడి కేసులో లంక క్రికెటర్ గుణతిలకకు బెయిల్‌

ట్విట్టర్ ద్వారా దీని గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. ఫ్యూయలింగ్ ట్రేసిబిలిటీ.. ఒక విశేషమైన ఆవిష్కరణ అని ఆయన అన్నారు. ఇప్పటికే ఉన్న సిలిండర్లకు క్యూఆర్ కోడ్ అతికించబడుతుందిని.. కొత్తవాటికి కూడా క్యూఆర్ కోడ్ తీసుకువస్తామని .. గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగం, దొంగతనం, ట్రాకింగ్, ట్రేసింగ్ కు ఈ క్యూఆర్ కోడ్ విధానం సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఎంక్వైరీకి సహాయపడుతుందని అన్నారు. కోడ్ సహాయంతో కస్టమర్ ఎవరూ.. సిలిండర్ కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న ‘ వరల్డ్ ఎల్పీజీ వీక్ 2022’ ఈవెంట్ లో క్యూఆర్ కోడ్ విధానంపై అధికారులు సంభాషించడంతో పాటు సాధ్యాసాధ్యాల గురించి ఆరా తీశారు. 14.2 కేజీల అన్ని డొమెస్టిక్ సిలిండర్లకు వచ్చే మూడు నెలల్లో క్యూఆర్ కోడ్ లను అమర్చనున్నారు. దొంగతనం సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు సిలిండర్లు వాటి భద్రతా పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. ఎల్పీజీ, సింథటిక్ ఎల్పీజీ వాతావరణ మార్పులను అడ్డుకునే పోరాటంలో సహాయపడుతాయిన కేంద్ర మంత్రి అన్నారు. మొదటి విడతలో 20,000 సిలిండర్లకు క్యూఆర్ కోడ్ కేటాయించనున్నారు.