Jk Bus Accident: జమ్యూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన దోడా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 30 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యు టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. బుధవారం ఉదయం బస్సు 40 మంది ప్రయాణికులతో కిష్త్వార్ నుంచి జమ్మూ వైపు వెళ్తోంది.
Also Read: Nana Patekar: షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
ఈ క్రమంలో ముందు వెళుతున్న బస్సును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ట్రుంగల్-అస్సార్ సమీపంలో అదుపుతప్పి 300 లోతు ఉన్న లోయలో పడిపోయింది.
ప్రమాదం గురించి తెలిసి అక్కడికి చేరుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి సహాయ బృందాలకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న రెస్య్కూ టీం సహాయ చర్యలు చేపట్టి గాయపడ్డవారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read: Nana Patekar: షూటింగ్ స్పాట్‌లో యువకుడిపై చేయి చేసుకున్న నటుడు.. వీడియో వైరల్
అనంతరం బస్సులో చిక్కుకున్న మృతదేహాలకు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంపై తాజాగా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. ‘దోడాలోని అస్సార్ లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. బాధితులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని డివ్ కామ్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మిన్‌ను ఆదేశించాం’ అని ఆయన తెలిపారు.
Many feared dead in Major road accident in Doda (JK) after bus carrying 40 passengers skidded off the road near Trungal – Assar and fell several metres downhill pic.twitter.com/4S6KXt31p9
— Weatherman Shubham (@shubhamtorres09) November 15, 2023
తాజావార్తలు
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!