NTV Telugu Site icon

Stomach surgery: కడుపులో వోడ్కా బాటిల్ .. రెండున్నర గంటలపాటు శస్త్రచికిత్స

Nepal Vodka Battele

Nepal Vodka Battele

నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడుపులోంచి మద్యం బాటిల్ ను బయటకు తీయడంలో నేపాల్ వైద్యులు విజయం సాధించారు. రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26ఏళ్ల యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో నూర్సాద్ మన్సూరి ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడినీ ఆస్పత్రికి తరలించారు.

Also Read: SL vs NZ: తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న లంక.. భారత్ ​కు ఊహించని షాక్‌..?

మన్సూరి అనే యువకుడిని డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్ లు చేసి.. కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. క్షణక్షణానికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు. డాక్టర్ల టీమ్ అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. కడుపులో ఉన్న వోడ్కా బాటిల్ ను బయటకు తీసేందుకు రెండున్నర గంటల సమయం పట్టిందని వైద్యులు వెల్లడించారు. మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు.. ఈ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది.. ఇప్పుడు రోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

Also Read: Dhruvanarayan: గుండెపోటుతో కాంగ్రెస్ సీనియర్ నేత కన్నుమూత

26 ఏళ్ల నూర్పాద్ మన్సూరి తన స్నేహితుడి కారణంగా ఆరోగ్యం క్షీణించిందని పోలీసులు తెలిపారు. అతను స్నేహితులతో కలిసి విపరీతంగా ఆల్కహల్ సేవించాడు.. మత్తులో అతని స్నేహితులలో ఒకరు అతని ప్రైవేట్ పార్ట్ ద్వారా అతని కడుపులో బాటిల్ ను బలవంతంగా చొప్పించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో మన్సూరి స్నేహితుడు షేక్ సమీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నూర్సాద్ స్నేహితులను కూడా పోలీసులు విచారించారు. సమీమ్ పై అనుమానం ఉన్నందుకే.. తాము అతనిని కస్టడిలోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నామని చంద్రపూర్ ఏరియా పోలీసులు తెలిపారు. నూర్సాద్ మన్సూరి మరికొందరు స్నేహితులు పరారీలో ఉన్నారనీ.. వారి కోసం గాలిస్తున్నామని రౌతహత్ కు చెందిన ఎస్పీ బహదూర్ బుధా మగర్ తెలిపారు.

Also Read: Heart Attack: ఫ్రెండ్స్‌తో థియేటర్‌ కి వెళ్లాడు.. సినిమా చూస్తూ కుప్పకూలిపోయాడు..