Site icon NTV Telugu

Scissors In Abdomen: వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో కత్తెర..12 ఏళ్ల తర్వాత తొలగింపు..

Scissors In Abdomen

Scissors In Abdomen

Scissors In Abdomen: సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో కత్తెర, 12 ఏళ్ల తర్వాత బయటపడింది. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు కత్తెరను మహిళ పొత్తికడుపులోనే వదిలేశారు. ఆమె గత దశాబ్ధకాలంగా నొప్పితో బాధపడుతూనే ఉంది. చాలా మంది వైద్యుల్ని సంప్రదించినప్పటికీ, నొప్పి తగ్గలేదు. చివరకు ఈ నెల ప్రారంభంలో ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

Read Also: India Canada: ఉగ్రవాద కేసులో కెనడా బోర్డర్ పోలీస్ సందీప్ సింగ్ సిద్ధూ.. కెనడాకు షాక్ ఇచ్చిన భారత్..

45 ఏళ్ల మహిళ శరీరంలో సర్జికల్ కత్తెరని గుర్తించారు. 2012లో ఆమెకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేసిన వైద్యులు కత్తెరని వదిలేశారు. 2012లో గాంగ్‌టక్‌లోని సర్ థుటోబ్ నామ్‌గ్యాల్ మోమరియల్ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగినట్లు ఆమె తెలిపింది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే ఉన్నానని, ఎంతో మంది వైద్యుల్ని సంప్రదించినప్పటికీ మందులు ఇచ్చారని, కానీ నొప్పి మాత్రం తగ్గలేదని చెప్పారు.

అక్టోబర్ 08న మళ్లీ అదే ఆస్పత్రిక వెళ్తే, ఎక్స్-రేలో సర్జికల్ కత్తెర బయటపడింది. వైద్యులు వెంటనే ఆపరేషన్ నిర్వహించి కత్తెరని బయటకు తీశారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త వైరల్ కావడంతో ఆస్పత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version