Site icon NTV Telugu

Tamil Nadu MP Sparks Row: హిందువుగా ఉన్నంత వరకు నువ్వు శూద్రుడివే.. డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Dmk Mp Raja

Dmk Mp Raja

Tamil Nadu MP Sparks Row: తమిళనాడు ఎంపీ, డీఎంకే నేత ఎ.రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుమతంపై ఆయన చేసిన వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. డీఎంకే నేత ఎ.రాజా హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆయన విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది.

నీలగిరి ఎంపీ, డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి రాజా మాట్లాడుతూ.. మనుస్మృతిలో శూద్రులను అవమానించారని, సమానత్వం, విద్య, ఉద్యోగాలు, దేవాలయాల్లోకి ప్రవేశం లేకుండా చేశారని అన్నారు. “హిందువుగా ఉండే వరకు నువ్వు శూద్రుడివి. శూద్రుడిగా ఉండే వరకు వేశ్య కొడుకువి. హిందువుగా ఉండే వరకు దళితుడివి. హిందువుగా ఉండే వరకు అంటరానివాడివి” ద్రవిడర్ కజగం సమావేశంలో ఆయన అన్నారు.

ఆయన ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన.. మీలో ఎంత మంది వేశ్యల కుమారులుగా ఉండాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. మీలో ఎంత మంది అంటరానివారిగా ఉండాలని అనుకుంటున్నారు? అని అడిగారు. ఈ ప్రశ్నల గురించి మనం గళం విప్పితేనే అది సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడంలో కీలక అంశం అవుతుందన్నారు. ఓ వ్యక్తి క్రిస్టియన్, ముస్లిం లేదా పర్షియన్ కాకపోతే హిందువు అయి ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇంత క్రూరత్వాన్ని ఎదుర్కొనే దేశం మరేదైనా ఉందా? అని అన్నారు.

ఆయన ప్రకటన తర్వాత తమిళ రాజకీయం వేడెక్కింది. తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై తన ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియోను పంచుకుంటూ ఆయ‌న ఇలా రాసుకొచ్చారు. “తమిళనాడులో రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. డీఎంకే ఎంపీ ఎ.రాజా ఇతరులను సంతోషపెట్టాలనే లక్ష్యంతో మరోసారి ఒక వర్గంపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారు. తమిళనాడుకు తామే గుర్రుగా ఉన్నామని భావించే ఈ రాజకీయ నేతల మనస్తత్వం చాలా దురదృష్టకరం. అని పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ మాట్లాడుతూ.. రాజా అనేక సందర్భాల్లో మహిళలను, హిందువులను అవమానించారన్నారు. హిందువుల గురించి డీఎంకే ఎంపీ చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆయ‌న అసంబద్ధమైన మాటలపై సోషల్ మీడియా నెటిజ‌న్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారీ ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.

Mini bus Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోరప్రమాదం.. లోయలో పడిన మినీబస్సు, 11 మంది మృతి

డీఎంకే నేత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఎ.రాజా తన వైఖరిని సమర్థించుకునేందుకు ట్విట్టర్‌లో మ‌రో కామెంట్ చేశారు. “శూద్రులు ఎవరు? వారు హిందువులు కాదా? మనుస్మృతిలో సమానత్వం, విద్య, ఉద్యోగాలు, ఆలయ ప్రవేశాన్ని నిరాకరించి వారిని ఎందుకు అవమానించింది. 90% హిందువుల రక్షకుడిగా ద్రావిడ ఉద్యమం వీటిని ప్రశ్నించింది. పరిష్కరించింది.” అని ట్వీట్ చేశారు.

రాజా వివాదాలకు కొత్తవారేమీ కాదు. ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. తమిళనాడు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో సీనియర్ నాయకుడు ఎ రాజా. ఆయ‌న‌ గతంలో కూడా ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేశారు. గతంలో ఆయనపై 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు విచారణ జరిగింది.

 

Exit mobile version