Site icon NTV Telugu

DMK Leader Stokes Row: కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు.. డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Rs Bharathi

Rs Bharathi

DMK Leader Stokes Row: నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో డీఎంకే నేత ఆర్‌ఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో అందరికీ విద్య అందుబాటులోకి తెచ్చింది ద్రవిడ ఉద్యమమేనని భారతి చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. నేడు కుక్కలు కూడా బీఎ పట్టాలు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే విద్యార్థి విభాగం కార్యదర్శి, కాంచీపురం ఎమ్మెల్యే ఎజిలరసన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా భారతి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం

“నేను బి.ఎల్‌తో న్యాయవాదిని. ఎళిలరాసన్ బి.ఇ., బి.ఎల్. ఇవేవీ ఏ వంశం లేదా తెగ నుండి వచ్చినవి కావు. నేను బి.ఏ చేస్తున్నప్పుడు సిటీలో ఒకరే చదివేవారు. ఇంటి ముందు నేమ్ బోర్డు పెట్టేవారు. ఈరోజు నగరంలో అందరూ డిగ్రీ చదువుతున్నారు, కుక్క కూడా బీఏ పట్టా పొందగలదు. ఈ ప్రగతి వెనుక ద్రవిడ ఉద్యమం ఉంది’’ అని ఆర్ఎస్ భారతి అన్నారు. ఆర్ఎస్‌ భారతి ప్రకటనపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఆర్‌ఎస్ భారతి ప్రకటన తమిళనాడు విద్యార్థులందరినీ అవమానించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమమే ప్రధాన కారణమని డీఎంకే సంస్థాగత కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి అన్నారు. కుక్క కూడా బీఎ పట్టా పొందే పరిస్థితి నేడు నెలకొందని అన్నారు. నీట్-యూజీ వైద్య పరీక్షకు వ్యతిరేకంగా నిరసన సందర్భంగా భారతి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. డీఎంకె నేతపై చర్య తీసుకోవాలని బీజేపీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కోరింది.

Exit mobile version