DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక
- జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- హాజరుకానున్న రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా డీకే శివకుమార్ లాంఛనంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలా, సిద్ధరామయ్య హాజరయ్యారు. సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా… ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో లోక్‌భవన్‌కు సమాచారం అందించారు. ఇక జూన్ 3న కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఇక డీకే.శివకుమార్ మంత్రివర్గం భారీ ఎత్తున ఉండొచ్చని తెలుస్తోంది. సలీం అహ్మద్, ఎం. వీరప్ప మొయిలీ సహా పార్టీ నాయకులు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఊపు తెచ్చేందుకు మంత్రివర్గంలోని దాదాపు సగం పదవులను కొత్త ముఖాలకు ఇవ్వాలని సూచించారు. ఇదిలా ఉంటే కొత్త ప్రభుత్వంలో తన వారికి రెండు డిప్యూటీ సీఎం పోస్ట్‌లతో పాటు కీలక పదవులు అప్పగించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దగ్గర డిమాండ్ పెట్టినట్లుగా సమాచారం. ఇక రాష్ట్ర నాయకత్వంలోనే కొనసాగుతానని సిద్ధరామయ్య తేల్చిచెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
జూన్ 3 ఎందుకు?
దైవభక్తి కలిగిన డీకే శివకుమార్.. ఏ చిన్న పని చేసినా పక్కా ముహూర్తం చూసుకుంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన వ్యక్తిగత జ్యోతిష్యుడు బేలూర్ ద్వారకానాథ్‌ను ప్రమాణస్వీకారం గురించి సంప్రదించినట్లు సమాచారం. ఆయన జూన్ 3వ తేదీ సాయంత్రం సమయాన్ని ‘శుభ ముహూర్తం’గా నిర్ధారించడంతో డీకే శివకుమార్ ఆ తేదీనే లాక్ చేశారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అందుబాటులో ఉండేలా చూసుకోవడం కూడా జూన్ 3ని ఎంచుకోవడానికి మరో ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లోని గ్లాస్ హౌస్‌లో అత్యంత నిరాడంబరంగా సాగనుందని సమాచారం.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!