Divya Pahuja: గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Pahuja: గురుగ్రామ్ హోటల్లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైంది. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెల్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు.
దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు. గండోలికి సంబంధించి బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఈమె ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. గతేడాది జూన్ నెలలో బెయిల్ మంజూరైంది. మంగళవారం గురుగ్రామ్ హోటల్లో హత్యకు గురైంది. పహుజా కనిపించడం లేదని ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
గురుగ్రామ్ లోని సెక్టార్ 14 పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. 27 ఏళ్ల దివ్య పహుజా జనవరి 1న తన స్నేహితుడు అభిజిత్ సింగ్‌తో కలిసి బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబం సభ్యులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ హోటల్ సమీపంలో ట్రేస్ అయ్యాయి. ఈ హోటల్ అభిజిత్ సింగ్‌దిగా అధికారులు చెబుతున్నారు. పోలీసులు హోటల్ సీసీటీవీని పరిశీలించగా.. కారిడార్‌లో దివ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. ఈ కేసులో అభిజిత్ సింగ్, అతని సన్నిహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సింగ్ అతని సన్నిహితులకు రూ. 10 లక్షలు ఇచ్చి డెడ్ బాడీని పడేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Pakistan: ఐదు లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిన పాకిస్థాన్..
గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు:
దివ్య పహుజాకు గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీతో సంబంధాలు ఉన్నాయి. 2016లో పహుజా, గడోలి కలిసి ముంబైలోని ఓ హోటల్లో ఉండగా.. హర్యానా పోలీసులు రైడ్స్ చేశారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో గడోలీ మరణించాడు. అయితే ఆత్మరక్షణలోనే గడోలీని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు, కానీ నిరాయుధుడైన గడోలీపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.
దివ్య పహుజా తల్లి సోనియా పహుజా హర్యానా పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వీరిద్దరి ఆచూకి తెలియజేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత దివ్య, ఆమె తల్లి, కొంతమంది పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాంబే హైకోర్టు ఏడేళ్ల తర్వాత వీరికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన కొద్ది నెలలకే హత్యకు గురైంది.
https://twitter.com/DeshrajH/status/1742566980841058712
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!