NTV Telugu Site icon

Divya Pahuja: గ్యాంగ్‌స్టర్ మాజీ ప్రియురాలు దివ్య పహుజా మర్డర్.. సీసీటీవీలో హంతకులు..

Divya Pahuja

Divya Pahuja

Divya Pahuja: గురుగ్రామ్ హోటల్‌లో మాజీ మోడల్, గ్యాంగ్‌స్టర్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ దివ్య పహుజా హత్యకు గురైంది. హోటల్ యజమాని, అతని సహచరులు హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఈ హత్య ఉదంతం, నిందితులు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యారు. బీఎమ్‌డబ్ల్యూ కారులో మృతదేహాన్ని తీసుకెల్లి గుర్తు తెలియని ప్రదేశంలో పడేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. హత్యకు కారణం ఇంకా తెలియరాలేదు.

దివ్యపహుజా మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ ప్రియురాలు. గండోలికి సంబంధించి బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఈమె ఏడేళ్ల పాటు జైలులో ఉన్నారు. గతేడాది జూన్ నెలలో బెయిల్ మంజూరైంది. మంగళవారం గురుగ్రామ్ హోటల్‌లో హత్యకు గురైంది. పహుజా కనిపించడం లేదని ఆమె కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఈ హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

గురుగ్రామ్ లోని సెక్టార్ 14 పోలీస్ స్టేషన్ అధికారులు మాట్లాడుతూ.. 27 ఏళ్ల దివ్య పహుజా జనవరి 1న తన స్నేహితుడు అభిజిత్ సింగ్‌తో కలిసి బయటకు వెళ్లిందని, అప్పటి నుంచి కనిపించకుండా పోయిందని కుటుంబం సభ్యులు ఫిర్యాదు చేశారు. చివరిసారిగా ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ హోటల్ సమీపంలో ట్రేస్ అయ్యాయి. ఈ హోటల్ అభిజిత్ సింగ్‌‌దిగా అధికారులు చెబుతున్నారు. పోలీసులు హోటల్ సీసీటీవీని పరిశీలించగా.. కారిడార్‌లో దివ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్న దృ‌శ్యాలు కనిపించాయి. ఈ కేసులో అభిజిత్ సింగ్, అతని సన్నిహితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని కనుగొనేందుకు పోలీసులు గాలిస్తున్నారు. సింగ్ అతని సన్నిహితులకు రూ. 10 లక్షలు ఇచ్చి డెడ్ బాడీని పడేయాలని సూచించినట్లు పోలీసులు తెలిపారు.

Read Also: Pakistan: ఐదు లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపిన పాకిస్థాన్..

గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలు:

దివ్య పహుజాకు గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలీతో సంబంధాలు ఉన్నాయి. 2016లో పహుజా, గడోలి కలిసి ముంబైలోని ఓ హోటల్లో ఉండగా.. హర్యానా పోలీసులు రైడ్స్ చేశారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో గడోలీ మరణించాడు. అయితే ఆత్మరక్షణలోనే గడోలీని కాల్చిచంపినట్లు పోలీసులు తెలిపారు, కానీ నిరాయుధుడైన గడోలీపై కాల్పులు జరిపినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

దివ్య పహుజా తల్లి సోనియా పహుజా హర్యానా పోలీసులతో నిరంతరం టచ్‌లో ఉంటూ వీరిద్దరి ఆచూకి తెలియజేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటన తర్వాత దివ్య, ఆమె తల్లి, కొంతమంది పోలీసులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. బాంబే హైకోర్టు ఏడేళ్ల తర్వాత వీరికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుదలైన కొద్ది నెలలకే హత్యకు గురైంది.

Show comments