NTV Telugu Site icon

Disha Salian Case: దిశా సాలియన్ ఆత్మహత్యకు తండ్రి ఎఫైర్ కారణమా..?

Disha Salian Case

Disha Salian Case

Disha Salian Case: దిశా సాలియన్ మృతి కేసు మరోసారి సంచలనంగా మారింది. ఐదేళ్ల క్రితం, ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ భవనం 14వ అంతస్తు నుంచి పడిపోయి చనిపోయింది. సెలబ్రిటీ మేనేజర్ అయిన దిశా, దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి కూడా పనిచేసింది. దిశా మరణించిన ఆరు రోజులకు సుశాంత్ తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు మరణాలపై అనేక పుకార్లు వచ్చాయి.

అయితే, ఇటీవల దిశా తండ్రి సతీష్ సాలియన్ తన కూతురు మృతి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురి మరణంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హస్తం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముంబై పోలీసులు ఆదిత్య ఠాక్రే, రియా చక్రవర్తితో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also: CM Chandrababu: ఆ ఆలోచన విరమించండి.. జనాభా పెంపుపై దృష్టి పెట్టండి.. ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు..

ఇదిలా ఉంటే, ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. దిశా సాలియన్ కేసు క్లోజర్ రిపోర్టులో సంచలన విషయాలు తెలిశాయి. ఆమె తండ్రి సతీష్ సాలియన్ ఆర్థిక ద్రోహం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. పలు ప్రాజెక్టులు ఫెయిల్యూర్ కావడం, స్నేహితులతో అపార్థాలతో పాటు, దిశా తండ్రి ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును థానేలోని తన సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్‌లో తనతో సంబంధం ఉన్న మహిళా ఉద్యోగి కోసం ఖర్చు చేయడం ద్వారా దుర్వినియోగం చేసినట్లు క్లోజర్ రిపోర్ట్ పేర్కొంది.

నివేదికల ప్రకారం, వ్యాపారం, కుటుంబ సమస్యల కారణంగా దిశా సాలియన్ ఒత్తిడికి గురవుతున్నట్లు అందరూ చెప్పారని, ఆమె కార్నర్‌స్టోన్ కంపెనీలో సెలబ్రిటీ మేనేజర్‌గా పనిచేసేది, ఆమె నిర్వహిస్తున్న ప్రాజెక్టులు ఆగిపోయవడం ఆమెను మరింత బాధపెట్టినట్లు తెలుస్తోంది. దిశ స్నేహితులతో పాటు ఆమెకు కాబోయే భర్త రాయ్ కూడా పోలీస్ వాంగ్మూలంలో ఆమె తండ్రి వ్యవహారం, ఆమె వ్యాపారం కోసం ఇచ్చిన డబ్బును వేరే మహిళకు ఖర్చు చేసినట్లు చెప్పారు. దిశా మరణంపై అనుమానాల నేపథ్యంలో, ఆమె తలకు బలమైన గాయం కావడంతో మరనించినట్లు నివేదిక చెప్పింది.