Site icon NTV Telugu

వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…

Supreme Court

Supreme Court

సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు. కానీ సంబంధిత “కోవిడ్” నిబంధనలు మాత్రం అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

అయితే ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తే తప్ప, తుది విచారణ కేసులు లేదా మామూలు రెగులర్ కేసులలో కోర్టు హాల్ లో పిటీషనర్ల తరఫున 20 మంది కంటే ఎక్కువ మంది లాయర్లు హాజరయ్యే అవకాశమే ఉంటే, ఆయా కేసులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు విచారణ కేసుల జాబితాను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకసారి ప్రత్యక్షంగా వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ ఆన్ రికార్డు కాని, లేదా పిటీషనర్-ఇన్ పర్సన్ కానీ తమ పేర్లను నమోదు చేసుకున్న తర్వాత, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు వారిని అనుమతించేదిలేదని స్పష్టం చేసిన ప్రకటన విడుదల చేసింది. ప్రత్యక్ష విచారణ జరిపే కేసులలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఇస్తే, లాయర్లు రెండు పధ్దతుల్లోనూ వాదనలు వినిపించవచ్చు. ప్రత్యక్ష విచారణలో పాల్గొనేందుకు ఎంచుకున్నట్లయుతే, “అడ్వకేట్ ఆన్ రికార్డ్‌” కానీ, లేదా నామినీ కానీ హాజరు కావచ్చు. అలాగే, పిటీషనర్ తరఫు వాదనలు వినిపించే ఒక లాయర్ తో పాటు మరో జూనియర్ లాయర్ కూడా కోర్టు హాలులో ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చింది.

అలాగే, ఒక కేసులో “అడ్వకేట్ ఆన్ రికార్డ్‌” ఎంపిక చేసుకున్న ఒక క్లర్క్ ను కూడా సంబంధిత కేసు పేపర్లు, జర్నల్స్ ను కోర్టు హాల్ వరకు మోసుకొచ్చేందుకు అనుమతి. ప్రత్యక్ష విచారణ కు హాజరయ్యే లాయర్లు, పిటీషనర్లకు ప్రత్యేక పాసులు జారీ. ప్రత్యక్ష విచారణ కేసుల జాబితా ను ప్రకటించిన తరువాత, మరుసటిరోజు 1 గంట లోగా, “అడ్వకేట్స్ ఆన్ రికార్డ్” ఆయా కేసుల్లో ప్రత్యక్షంగా హాజరౌతారో లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరౌతారో నమోదు చేసుకోవాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు పోర్టల్ లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపింది.

Exit mobile version