NTV Telugu Site icon

Dinosaur Nests: మధ్యప్రదేశ్ నర్మదా లోయలో 256 డైనోసార్ గుడ్లు..

Dinosaur Nest

Dinosaur Nest

Dinosaur Nests And 265 Eggs Found In Madhya Pradesh’s Narmada Valley: మానవుడి మనుగడ లేని సమయంలో డైనోసార్లు ఈ భూమిని ఏలాయి. దీనిపై పరిశోధకులు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. చాలా చోట్ల డైనోసార్లకు సంబంధించి శిలాజాలు లభించాయి. క్రెటేషియస్ యుగం ముగిసే సమయానికి డైనోసార్లు అంతరించిపోయాయి. ఇదిలా ఉంటే ఇటీవల మధ్యప్రధేశ్ నర్మదా లోయలో డైనోసార్ గూళ్లు, శాకాహార టైటానోసార్లకు సంబంధించి 256 గుడ్లను శిలాజ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఢిల్లీ యూనివర్శిటీ, మోహన్‌పూర్-కోల్‌కతా, భోపాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పరిశోధకులు మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని బాగ్, కుక్షి ప్రాంతాలలో అనేెక పెంకులు కలిగిన గుడ్లను కనుగొన్నట్లు వెల్లడించారు.

Read Also: China: చైనాలో లెక్కకుమించి కోవిడ్ మరణాలు.. వారంలో 13 వేల మంది మృతి

ఈ డైనోసార్స్ గూళ్లు, గుడ్లు 66 మిలియన్ ఏళ్ల క్రితం ఉనికిలో ఉన్న పొడవైన మెడ కలిగిన డైనోసార్ జాతికి చెందినదిగా వెల్లడించారు. నర్మదా లోయలో దొరికిన గూళ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయని.. సాధారణంగా డైనోసార్ గూళ్లు ఒకదానికి ఒకటి కొంతదూరంలో ఉంటాయి. కానీ నర్మదా నదిలో దొరికిన డైనోసార్ శిలాజాలు ఇందుకు భిన్నంగా పరిశోధకులు చెబుతున్నారు. 15 సెం.మీ మరియు 17 సెం.మీ వ్యాసం కలిగిన గుడ్లు, అనేక టైటానోసార్ జాతులకు చెందినవి కావచ్చని.. ఒక్కో గూడులోని గుడ్ల సంఖ్య ఒకటి నుండి 20 వరకు ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు.. తల్లి గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో గుడ్లపై పెంకుపై పెంకు ఏర్పడినట్లు అంచానా వేస్తున్నారు.

భారత టెక్టానిక్ ప్లేట్ నుంచి సీషెల్స్ విడిపోయిన సమయంలో టెథిస్ సముద్రం నర్మదాతో కలిసిన ప్రదేశంలో ఈ గుడ్లను కనుక్కున్నారు. సీషెల్స్ భారత్ నుంచి వదిపోయిన సందర్భంలో నర్మదా లోయలోకి టెథిస్ సముద్రం 400 కిలోమీటర్లు చొచ్చకువచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు.