CPIM: అర్బన్ నక్సల్ తర్వాత దిమాగీ నక్సల్.. మోదీపై సీపీఎం ఆరోపణలు..
- ప్రధాని ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం..
- జంతర్ మంతర్ నిరసనకారుల్ని టార్గెట్ చేశారని సీపీఎం చీఫ్ ఎంఏ బేబీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPIM: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన “దిమాగీ నక్సల్” పదంపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ పదాన్ని ఉపయోగించడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ స్పందించారు. ఈ పదాన్ని ప్రభుత్వాన్ని విమర్శించే వారిని, జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టే వారిని ఉద్దేశించి చేశారని ఆయన అన్నారు. గతంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లను విమర్శించే వారిని ‘అర్బన్ నక్సల్స్’గా ముద్ర వేశారని, ఇప్పుడు ఇదే తరహాలో ‘దిమాగీ నక్సల్స్’ అనే కొత్త పదాన్ని తీసుకువచ్చారని బేబీ అన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ మాట్లాడుతూ, ‘దిమాగీ నక్సల్స్’ అనే పదాన్ని వాడారు. డవుల్లో ఆయుధాలు పట్టుకున్న నక్సలిజం దాదాపు అంతమయ్యే దశలో ఉన్నప్పటికీ, “దిమాగీ నక్సల్” భావజాలం ఉన్నవారు హింస, అశాంతికి అవకాశాల కోసం చూస్తున్నారని అన్నారు. ఇలాంటి మావోయిస్టు భావజాలం ఉన్న వారిని గుర్తించి, ఏకాకుల్ని చేయాలని పిలుపునిచ్చారు.
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నక్సలిజాన్ని అంతం చేశామని చెబుతున్న విధానంపై బేబీ ప్రశ్నలు లేవనెత్తారు. యువకులు, యువతను పట్టుకుని న్యాయప్రక్రియ ముందు నిలబెట్టే బదులుగా ఎన్కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదమని అభివర్ణించారు. వామపక్షాలు నక్సలిజాన్ని ఎప్పుడూ సమర్థించలేదని బేబీ స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, దిమాగీ నక్సల్స్ ఇప్పుడు రాజకీయ రచ్చకు దారి తీసింది. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యపై కాంగ్రెస్, సీపీఐ, సమాజ్‌వాదీ తదితర ప్రతిపక్షాలు మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. మోదీ గతంలో తన రాజకీయ ప్రత్యర్థులను “అర్బన్ నక్సల్స్” అని పిలిచారని, ఇప్పుడు “దిమాగీ నక్సల్స్” అంటున్నారని విమర్శించారు. ఇది ప్రధాని నిరాశకు సంకేతమని అన్నారు.
తాజావార్తలు
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!