Site icon NTV Telugu

Dihuli Massacre: “దిహులి దళితుల ఊచకోత”.. 44 ఏళ్ల తర్వాత తీర్పు.. ముగ్గురికి ఉరిశిక్ష..

Dihuli Massacre

Dihuli Massacre

Dihuli Massacre: నవంబర్ 18, 1981న సాయుధ దుండగుల గుంపు ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజాబాద్‌లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని దిహులి గ్రామంలోని ఎస్సీ కాలనీపై విరుచకుపడ్డారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు, పిల్లలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 2 మంది మరణించారు. ఈ ఘటన ‘‘దిహులి ఊచకోత’’గా చరిత్రలో నిలిచిపోయింది. ఈ ఘటన జరిగిన 44 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది. దోషులుగా తేలిన ముగ్గురికి కోర్టు ‘‘మరణశిక్ష’’ విధించింది. దోషుల్లో ఒకరు పరారీలో ఉన్నారు.

Read Also: Shashank Singh: పృథ్వీ షా తిరిగి సక్సెస్ సాధించగలడు.. యంగ్ క్రికెటర్ సలహా

మంగళవారం, దోషులు కెప్టె్న్ సింగ్, రాంసేవక్ కోర్టు ముందు హాజరయ్యారు. మూడో దోషి రాంపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితులందరిలో ముగ్గురు మాత్రమే ప్రస్తుతం బతికి ఉన్నారు. ఈ హత్యాకాండపై స్థానిక నివాసి లాయక్ సింగ్ నవంబర్ 18, 1981లో ఫిర్యాదు చేశారు. జస్రానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. రాధేశ్యామ్ అలియాస్ రాధే, సంతోష్ చౌహాన్ అలియాస్ సంతోష, రాంసేవక్, రవీంద్ర సింగ్, రాంపాల్ సింగ్, వేద్రామ్ సింగ్, మిట్టు, భూప్రమ్, మాణిక్ చంద్ర, లాటూరి, రామ్ సింగ్, చున్నిలాల్, హోరిలాల్, సోన్‌పాల్, లాయక్ సింగ్, బన్వారీ, జగదీష్, రేవతి దేవి, ఫూల్ దేవి, కెప్టెన్ సింగ్, కమ్రుద్దీన్, శ్యాంవీర్, కున్వర్‌పాల్, లక్ష్మిలతో సహా 20 మందికి పైగా వ్యక్తులపై అభియోగాలు మోపారు.

సామూహిక హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా కోర్టులో ప్రాథమిక విచారణల తర్వాత, కేసును ప్రయాగ్‌రాజ్‌కు బదిలీ చేశారు. అక్కడి నుంచి కేసును మళ్లీ మెయిన్‌పురి స్పెషల్ జడ్జి రాబరీ కోర్టుకు బదిలీ చేశారు, ఇక్కడ కేసు గత 15 సంవత్సరాలుగా విచారణలో ఉంది. గత నెల ప్రారంభంలో, మార్చి 11న మెయిన్‌పురిలోని రాబరీ కోర్టు న్యాయమూర్తి ఇందిరా సింగ్ నిందితుల్లో ముగ్గురిని సామూహిక హత్యల దోషులుగా నిర్ధారించింది. ఈ రోజు కోర్టు ముందు హాజరైన కెప్టెన్ సింగ్, రాంసేవక్ తాము నిర్దోషులమని వాదించారు. ఈ రోజు తుది తీర్పులో, పరారీలో ఉన్న మూడో దోషి రాంపాల్‌తో సహా ముగ్గురికి కోర్టు మరణశిక్ష విధించింది.

Exit mobile version