NTV Telugu Site icon

Digital Voter ID Card: స్మార్ట్ ఫోన్‌ ద్వారా డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు

Digital Voter Id Card

Digital Voter Id Card

Digital Voter ID Card: దేశంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఓటు హక్కు కల్పించిన విషయం తెలిసిందే. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి అర్హుడు.అయితే ఓటు వేయాలంటే అతనికి లేదా ఆమెకు తప్పకుండా ఓటర్‌ లిస్టులో పేరుండాలి.. అలా పేరున్న వారికి ఓటర్‌ గుర్తింపు కార్డును ఇస్తారు. ఇపుడు ఓటర్‌ గుర్తింపు కార్డును డిజిటల్‌లో కూడా తీసుకొచ్చారు. భారత ఎన్నికల కమిషన్‌ ఓటర్‌ గుర్తింపు కార్డును డిజిటల్‌ కార్డుగా తీసుకొచ్చింది. అయితే ఎక్కువ మంది ఈ డిజిటల్‌ ఓటర్‌ గుర్తింపు కార్డును వినియోగించడం లేదు. డిజిటల్‌ ఓడర్‌ ఐడీ కార్డును పొందడం చాలా సులభం. స్మార్ట్ ఫోన్‌ ద్వారా డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డును పొందవచ్చు.

Read Also: Sabitha Indra Reddy: మంత్రి సబితా కీలక ప్రకటన.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌..

దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్‌ గుర్తింపు కార్డును అందిస్తోంది. ఈ కార్డు ఉంటేనే రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోగలుగుతారు. ఈ కార్డు ఓటింగ్‌ సమయంలోనే కాకుండా చాలా సందర్భాల్లో మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది ఆదార్‌ కార్డు, పాన్‌ కార్డును తీసుకెళుతున్నట్టుగా ఓటరు కార్డును తమ వద్ద ఉంచుకోరు. ఓటు వేసే సమయంలో మాత్రమే దాన్ని బయటకు తీస్తుంటారు. మన వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్‌ ద్వారానే డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డును పొందవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ కాపీని ఉంచుకుని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సులభంగా వినియోగించుకోవచ్చు. ఎన్నికల సమయంలోనూ ఈ డిజటల్ కార్డును చూపించి నేరుగా ఓటు వేయచ్చు. డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది. భారత్‌లో ప్రస్తుతం 9.8 కోట్ల మంది ఓటర్లకు ఇ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉన్నా 1 శాతం మంది మాత్రమే డిజిటల్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. డిజిటల్ ఓటర్ కార్డును ఎడిట్ చేయలేని పీడీఎఫ్ ఫైల్ రూపంలో పొందవచ్చు. దీన్నే ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడీ కార్డ్‌గా పిలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక పోర్టల్‌ నుంచి దీనిని పొందవచ్చు. పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకున్న డిజిటల్ కార్డును ప్రింట్ తీసుకుని లామినేట్ చేయించుకుని నిత్యం వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. డిజిటల్ ఓటరు గుర్తింపు కార్డుల ప్రధాన లక్ష్యం ఓటరు గుర్తింపు కార్డులను డిజిటల్ ఫార్మాట్‌లో జారీ చేయడమే. ఈ విధానం ద్వారా పౌరులు ఓటరు గుర్తింపు కార్డు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదు. ఓటర్లు తమ ఓటరు ఐడీ కార్డును కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇంటి వద్ద నుంచే చాలా సులభంగా పొందవచ్చు.

Read Also: Diamond Mining : ఆ ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని ప్రచారం.. ఎగబడ్డ జనం

డిజిటల్‌ ఓటర్‌ ఐడీ కార్డు ఎలా పొందాలంటే…
ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ http://eci.gov.in/e-epic/ లోకి వెళ్లాలి. ఈసీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic Download ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయాలి. మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి, రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి. వివరాలు అన్ని పూర్తి చేసిన తర్వాత Send OTP పైన క్లిక్ చేయాలి.
ఆ ఓటర్ ఐడీ కార్డుకు లింక్ అయిన మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Download e-EPIC పైన క్లిక్ చేయాలి. నాన్ ఎడిటెబుల్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డిజిటల్ ఓటర్ ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ అవుతుంది.

Show comments