NTV Telugu Site icon

Mahakumbh Mela 2025: ఐడియా అదిరిపోలా.. కుంభమేళాలో డిజిటల్ స్నానం.. రూ. 1100 చెల్లిస్తే చాలు..

Digital

Digital

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షి్స్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచనలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు.

Also Read:Home Ministry: ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్‌.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు..

కానీ, చాలా మంది వివిధ కారణాల వల్ల మహా కుంభమేళాలో పాల్గొనలేకపోతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు వినూత్నంగా ఆలోచించాడు. పుణ్యస్నానాలను.. డిజిటల్ స్నానాలుగా మార్చేశాడు. అయ్యో కుంభమేళాలలో పాల్గొనలేకపోయామే అనే బాధ లేకుండా భక్తులకు త్రివేణి సంగమంలో డిజిటల్ స్నానాలు చేసే అవకాశాన్ని కల్పించాడు. అసలు ఈ డిజిటల్ స్నానం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? కుంభమేళాకు హాజరుకాలేని భక్తులు వారి ఫోటోలను వాట్సా్ప్ లో పంపాలని, వాటిని ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో ముంచుతానని ఓ యువకుడు వెల్లడించాడు. తన స్టార్టప్ పేరు ప్రయాగ్ ఎంటర్‌ప్రైజెస్ అని పేర్కొన్నాడు.

Also Read:Aarogyasri CEO : ఆరోగ్య శ్రీలో అవకతవకలు.. సీఈవోపై బదిలీ వేటు..

డిజిటల్ స్నానానికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఆ వీడియోలో డిజిటల్ స్నానాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. భక్తులు డిజిటల్ స్నానాల కోసం రూ. 1100 చెల్లించాలని.. అప్పుడు వారి ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచడం ద్వారా కుంభమేళాలో డిజిటల్ స్నానం ఆచరించేలా చేస్తామని తెలిపాడు. ఈ వ్యవహారంపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. బిజినెస్ ఐడియా అదిరిపోయిందంటూ కొందరు, టెక్నాలజీని వాడేస్తున్నావ్ బాసు అంటు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఇదే కుంభమేళాలో మోనాలిసా తన అందంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఏకంగా బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసింది.