Site icon NTV Telugu

Jharkhand: ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..

Viral News

Viral News

Jharkhand: జార్ఖండ్ ధన్‌బాద్‌లో మద్యం వ్యాపారులు తమ అవినీతిని పాపం ఎలుకలపై నెట్టేస్తున్నారు. ధన్‌బాద్‌లో ఇండియన్ మేడర్ ఫారిన్ లిక్కర్ నిల్వల్లో అవినీతినికి పాల్పడిన వ్యాపారులు, ఆ నెపాన్ని అమాయకపు ఎలుకలపై నెట్టేసే ప్రయత్నం చేశారు. నిల్వలు సరిగా లేవని వివరించలేదని వారు, దాదాపు 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగుతున్నాయని ఆరోపించారు. సెప్టెంబర్ 01న జార్ఖండ్ కొత్త లిక్కర్ పాలసీ ప్రారంభించడానికి నెల రోజుల ముందు, ఎలుకలపై ఈ నేరాన్ని మోపారు.

Read Also: Pakistan: భారత్ అంటే తెలిసొచ్చింది.. ‘‘అణు బెదిరింపుల’’పై వెనక్కి తగ్గిన పాకిస్తాన్..

కొత్త మద్యం విధానం అమలులోకి రాకముందే, రాష్ట్ర అధికారులు మద్యం నిల్వలను పరిశీలిస్తోంది. ఈ డ్రైవ్‌లో భాగంగా ధన్‌బాద్ లోని బలియాపూర్, ప్రధాన్ కుంట ప్రాంతాల్లోని దుకాణాల్లో తనికీలు చేశారు. మెత్తం స్టాక్‌లో 802 MFL బాటిళ్లు ఖాళీగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. అయితే, ఎలుకలు బాటిళ్ల మూతల్ని నమిలేసి, మద్యాన్ని తాగాయని వ్యాపారులు, అధికారులకు సమాధానం ఇవ్వడం షాకింగ్‌గా మారింది. అయితే, అధికారులు వీటిని నమ్మలేదు, వ్యాపారులు నష్టాన్ని చెల్లించాలని కోరారు.

అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రాంలీలా రవణి మాట్లాడుతూ, వ్యాపారులకు నష్టాలకు పరిహారం చెల్లించమని నోటీసులు పంపుతామని చెప్పారు. మద్యం నిల్వలు తగ్గిపోవడానికి ఎలుకలను నిందిస్తున్న వ్యాపారుల గురించి అడిగినప్పుడు, ఆయన “అర్ధంలేనిది” అని బదులిచ్చారు. ధన్‌బాద్‌లో గతంలో 10 కిలోల భాంగ్, 9 కిలోల గంజాయని ఎలుకలు తిన్నాయని ఆరోపించడం కూడా జరిగింది.

Exit mobile version