Site icon NTV Telugu

DGCA: స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు

Dgca

Dgca

స్పైస్‌జెట్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ).. స్పైస్ జెట్లలో తలెత్తున్న సాంకేతిక సమస్యలు, నిర్వహణ సరిగా లేకపోవడం మరియు విడిభాగాలు కొనుగోలు చేసి.. విక్రేతలకు డబ్బులు చెల్లించడంలో వైఫల్యం కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని నోటీసుల్లో పేర్కొంది డీజీసీఏ.. సురక్షితమైన, సమర్థవంతమైన, విశ్వాసం కూడిన వివామన సేవలను అందించడంలో విఫలం అయిన కారణంగా స్పెస్‌ జెట్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది డీజీసీఏ.. ఇక, భారత్‌లో బిజినెస్‌ సర్వీసెస్‌ నడపడానికి ఉన్న అనుమతి మరో ఏడాది పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుందని హెచ్చరించింది.

Read Also: Kaali Poster Row: ‘కాళి’ వివాదాస్పద చిత్రంపై టొరంటో అగాఖాన్ మ్యూజియం తీవ్ర విచారం

కాగా, స్పైస్‌ జెట్‌ గత 24 గంటల సమయంలోనే మూడు విమానాల్లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంది.. ఇక, కేవలం 18 రోజుల వ్యవధిలోనే ఎనిమిది సార్లు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో, విమానయాన సంస్థపై ఎందుకు చర్య తీసుకోకూడదనే దానిపై స్పందించడానికి స్పైస్‌జెట్ మేనేజర్, ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసింది డీజీసీఏ.. దానికి సమాధానం ఇవ్వడానికి మూడు వారాల గడువు ఇచ్చింది.. అయితే, స్పైస్‌జెట్ యొక్క ఢిల్లీ-జబల్‌పూర్ విమానం గాలిలో ఎగురుతోన్న సమయంలో క్యాబిన్‌లో పొగ వచ్చిన విషయం తెలిసిందే.. ఇక, ఇంధన సూచిక లోపం కారణంగా ఢిల్లీ-దుబాయ్ విమానాన్ని కరాచీకి మళ్లించడం, కాండ్లా-ముంబై విమానంలో పగిలిన విండ్‌షీల్డ్ మరియు వాతావరణ రాడార్‌లో స్నాగ్ వంటి కనీసం మూడు సంఘటనలను విమానయాన సంస్థ ఎదుర్కొన్న ఒక రోజు తర్వాత నోటీసులు ఇచ్చింది డీజీసీఏ. కోల్‌కతా నుండి చాంగ్‌కింగ్‌కి వెళ్తున్న దాని కార్గో విమానంలో కూడా సమస్యలు తలెత్తడంతో మంగళవారం నాటి స్నాగ్‌లు మే 1 నుండి స్పైస్‌జెట్‌కు సంబంధించిన మొత్తం సంఘటనలను 8కి పెంచాయి.

మరోవైపు, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఒక ట్వీట్‌లో ప్రయాణికుల భద్రత చాలా ముఖ్యమైనదని.. వారి భద్రతకు ఆటంకం కలిగించే చిన్న పొరపాటు కూడా క్షుణ్ణంగా పరిశోధించబడుతుంది మరియు సరిదిద్దబడుతుంది అని పేర్కొన్నారు.. అయితే, స్పైస్‌జెట్‌లో అంతర్గత భద్రతా పర్యవేక్షణ సరిగా లేకపోవడం, దాని విమానాల నిర్వహణలో వైఫల్యం మరియు ఆర్థిక స్థితి సరిగా లేకపోవడం వల్ల భద్రతా లోపాలను డీజీసీఏ నిందించింది. కాగా, మే 16, 2023 వరకు వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించడానికి స్పైస్‌జెట్‌కు అనుమతి ఉందని.. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే దాని అనుమతిని రద్దు చేయవచ్చని పరోక్షంగా హెచ్చరించింది డీజీసీఏ.

Exit mobile version