Site icon NTV Telugu

Air Arabia: ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ పై డీజీసీఏ విచారణ

Aira Arabia

Aira Arabia

బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) అబుదాబి వెళ్తున్న ఎయిర్ అరేబియా విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో సోమవారం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. విమానం రెండు ఇంజిన్లలో ఒకటి ఆకాశంలో విఫలం అవ్వడంతో సిబ్బంది ‘ మేడే’ ప్రకటించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. తాజాగా ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం విచారణకు ఆదేశించింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ)తో ప్రాథమిక దర్యాప్తు జరుగుతుందని డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

చిట్టగాంగ్ నుంచి అబుదాబి బయలుదేరిన ఎయిర్ అరేబియా 3ఎల్-062, ఎయిర్ బస్ ఏ320 విమానం భారత గగనతలంలో ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండు ఇంజిన్లలో ఒకటి నిలిచిపోవడంతో సిబ్బంది ఎమర్జెన్సీ డిక్లర్ చేసింది. వెంటనే మేడే ప్రకటించి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సిబ్బంది ఎవరూ గాయపడలేదు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరిపేందుకు ముంబై నుంచి ఏఏఐబీ టీం అహ్మదాబాద్ కు వెళ్లింది.

Exit mobile version