Devendra Fadnacis: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఢిల్లీలో వేగంగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మరోవైపు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఫడ్నవీస్‌తో పాటు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాన్ రాజీనామా చేయగానే ఫడ్నవీస్, షిండేకు బీజేపీ హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఫడ్నవీస్‌ను కేంద్ర మంత్రి మండలిలోకి తీసుకుంటారే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల మహారాష్ట్రలో కూడా ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేసి, ఢిల్లీకి వెళ్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా రౌత్ వ్యాఖ్యలకు బలాన్ని ఇస్తున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఓ సీనియర్ బీజేపీ నేతను సీఎంగా ఎన్నుకోవచ్చని ఆ సమయంలో ఆయన అన్నారు.

