Site icon NTV Telugu

Ice Cream: ఐస్ క్రీమ్‌లో డిటర్జెంట్ పౌడర్..?

Ice Cream

Ice Cream

Ice Cream: కర్ణాటక అధికారులు ఆహారం కల్తీపై యుద్ధమే చేస్తున్నారు. తాజాగా, కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(ఎఫ్‌డీఏ), ఐస్ క్రీమ్ తయారుదారుల్ని హెచ్చరించింది. ఐస్ క్రీమ్ తయారీలో క్రీమీ షేప్ రావడానికి డిటర్జెంట్ పౌడర్ ఉపయోగిస్తు్న్నట్లు అనుమానిస్తోంది. ఇదే కాకుండా ఎముకలను బలహీనపరిచే ఫాస్పోరిక్ ఆమ్లాన్ని వాడుతున్నట్లు కొనుగొంది. దీనిని కూల్ డ్రింక్స్‌లో పొంగే గుణం కోసం వాడుతారు.

Read Also: Devendra Fadnavis: “ఉద్ధవ్ మీరు మీ నాన్న వైపు ఉంటారా..?, రాహుల్ గాంధీ వైపా..?

సరైన నిల్వ పరిస్థితులు నిర్వహించడంలో విఫలమైనందుకు 97 దుకాణాలకు హెచ్చరిక నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. అధికారులు ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ తయారీదారులకు రూ. 38,000 జరిమానా విధించారు. పిల్లలు సాధారణంగా తినే ఆహార ఉత్పత్తులు వాటి నాణ్యత, తయారీని అంచనా వేయడానికి ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ ఉత్పత్తి చేసే యూనిట్లపై అధికారులు రెండు రోజులుగా దాడులు చేస్తున్నారు.

తనిఖీల సమయంలో అధికారులు అనేక ప్రదేశాల్లో అపరిశుభ్రమైన పరిస్థితుల్ని కనుగొన్నారు. కొంతమంది తయారీదారులు ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడానికి డిటర్జెంట్, యూరియా, స్టార్చ్‌తో తయారు చేసిన సింథటిక్ పాలను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. న్యాచురల్ షుగర్ స్థానంలో, ఆహార రుచిని, రంగును పెంచడానికి సాచరిన్, అనుమతి లేని రంగుల వంటి హానికరమైన పదార్థాలను వాడుతున్నట్లు తేలింది. ఐస్ క్యాండీలు, కూల్ డ్రింక్స్‌లో కలుషితమైన పనికిరాని నీటిని ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాలలో పరిమితికి మించిన ఫ్లేవర్ ఏజెంట్లను వాడుతున్నట్లు తేలింది.

Exit mobile version