NTV Telugu Site icon

Software Engineer: పని ఒత్తిడితో డిప్రెషన్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

Software Engineer

Software Engineer

Software Engineer: ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి, 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతి దేశవ్యాప్తంగా సంచలంగా మారింది. పని ఒత్తిడి వల్లే తన కూతురు చనిపోయిందని ఆమె తల్లి ఆరోపించారు. ఈ ఘటన ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఎలాంటి సమస్యలు, పని ఒత్తిడి ఉందనే విషయాన్ని హైలెట్ చేస్తున్నాయి. అన్నా మరణంపై అనేక మంది కార్పొరేట్ ఉద్యోగులు స్పందిస్తున్నారు. తాము కూడా ఇదే సమస్యల్ని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచంలో పని ఒత్తిడిపై కొనసాగుతున్న ఆందోళన మధ్య, తమిళనాడు థాజంబూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర నిరాశకు గురైన 38 ఏళ్ల కార్తికేయ గురువారం రాత్రి తన ఇంట్లో ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఘటన సమయంలో కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు, అతడి భార్య గుడిచి వెళ్లి వచ్చే సరికి, కరెంట్ వైర్లు శరీరానికి చట్టుకుని అపస్మారకంగా పడి ఉన్నాడు.

Read Also: USA: పీఎం మోడీ యూఎస్‌ పర్యటనకు ముందు.. ఖలిస్తాన్ గ్రూపులతో వైట్‌హౌజ్ సమావేశం..

బాధితుడు తేనుకు చెందిన వ్యక్తి కాగా, గత 15 ఏళ్లుగా చెన్నైలోని పల్లవరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన భార్య జయరాణి, 10,8 వయసు కలిగిన ఇద్దరు పిల్లలతో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. బాధితుడు గత రెండు నెలల క్రితం డిప్రెషన్‌తో మెదవాక్కంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతను పని ఒత్తిడికి గురైనట్లు చెప్పారు.

కార్తికేయ భార్య జయవాణి సోమవారం తన స్నేహితులు, పిల్లలతో కలిసి తిరునల్లారు ఆలయాని వెళ్లింది. కార్తికేయ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. రాత్రి తిరిగి వచ్చి చూసేసరికి లోపల నుంచి గడియ వేసి ఉంది. తలుపు తెరవకపోవడంతో స్పేర్ కీ‌తో తలుపు తెరిచింది. కార్తికేయన్ తన శరీరానికి ఎలక్ట్రిక్ వైర్లు చుట్టుకుని దానిని, విద్యుత్‌ బాక్సుకు కనెక్షన్ ఇచ్చి కరెంట్ షాక్‌తో చనిపోయాడు. తజాంబూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.