Dense fog delays 40 flights in Delhi: ఉత్తరాది రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో పాటు పలు ప్రాంతాల్లో పొగమంచు కుమ్ముకుంది. ముఖ్యంగా ఢిల్లీ చలిగాలుల తీవ్రతతో తీవ్రంగా ప్రభావితం అవుతోంది. దీంతో పాటు దట్టమైన పొగమంచు ఢిల్లీ వ్యాప్తంగా ఏర్పడింది. దీంతో సమీపంలోని పరిసరాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది.
Read Also: Bajrang Dal: అస్సాంలో భజరంగ్ దళ్ కార్యకర్త హత్య.. కర్ణాటకలో హత్యాయత్నం..
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి వచ్చి వెళ్లే విమానాల్లో తీవ్ర జాప్యం ఏర్పడింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఢిల్లీ నుంచి బయలుదేరే 40 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు డిలే అయ్యాయి. మంగళవారం ఢిల్లీలో అత్యల్పంగా 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఢిల్లీ-ఖాట్మండు, ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-సిమ్లా, ఢిల్లీ-డెహ్రాడూన్, ఢిల్లీ-చండీగఢ్-కులు విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 18 విమానాలు ఆలస్యం అయ్యాయి. 50 దేశీయ విమానాల బయలుదేరడం ఆలస్యం అయింది.
ఐఎండీ ప్రకారం విజిబిలిటీ 1,000 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే ‘మోడరేట్’గా, 200-500 మీటర్ల మధ్య పరిసరాలు కనిపించకుంటే ‘మధ్యస్థం’గా, 200 కంటే తక్కువ విజిబిలిటీ ఉంటే ‘దట్టమైంది’గా, 50 మీటర్ల కన్నా తక్కువగా ఉంటే ‘చాలా దట్టమైన’ పొగమంచుగా వర్గీకరించారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఉదయం పొగమంచు కమ్ముకోవడంతో ఉత్తర భారతదేశంలోని రైళ్లు కూడా దెబ్బతిన్నాయి. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఢిల్లీలోని పాలెంలో 8.4 డిగ్రీలు, సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 7.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
