NTV Telugu Site icon

Demolition Mosque: ముంబైలో సొంత అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న మసీదు ట్రస్ట్..!

Mumbai

Mumbai

Demolition Mosque: ముంబై నగరంలోని ధారావిలో అక్రమంగా నిర్మించిన మసీదు కూల్చివేతకు నేటి (సోమవారం)తో గడువు అయిపోయింది. దీంతో మసీదు కమిటీనే స్వయంగా తమ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేతలు కొనసాగిస్తుంది. బీఎంసీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మసీదు ట్రస్ట్ స్వయంగా ఈ చర్యలకు దిగింది. అయితే, అక్రమ నిర్మాణం కూల్చివేతలో భాగంగా ముందుగా గోపురాన్ని కూల్చివేస్తున్నారు. ఆ తర్వాత ఇతర అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు రెడీ అయ్యారు. దీనికి ముందు మసీదు ట్రస్టు అక్రమ నిర్మాణంలో కొంత భాగాన్ని పచ్చటి పరదాతో కప్పేసింది. బీఎంసీ టీమ్ మసీదును పరిశీలించేందుకు వచ్చింది. అప్పుడు, అక్రమ నిర్మాణాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది.

Read Also: US Embassy: అమెరికా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్.. 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్స్..!

ఇక, ఈ మసీదులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామని మసీదు ట్రస్టు సభ్యులు స్వయంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మసీదు కూల్చివేత పనులను స్టార్ట్ చేసింది. హిమాచల్‌లోని కులులో అక్రమ మసీదు నిర్మాణంపై హిందూ సంస్థలు తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. పూణెలో అక్రమంగా నిర్మితమైన మసీదు, మదర్సా కూల్చివేత పనులను పూణే మహానగర పాలక సంస్థ కొనసాగిస్తుంది.