Site icon NTV Telugu

Joshimath Sinking: జోషిమఠ్‌లో కూల్చివేతలు ప్రారంభించిన ప్రభుత్వం.

Joshimath

Joshimath

Joshimath Sinking: ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణం కుంగిపోతోంది. ఇప్పటికే 600కు పైగా ఇళ్లకు బీటలు వారాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే జోషిమఠ్ పట్టణం కుంగిపోవడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సమావేశం అయింది. ప్రధాని నరేంద్రమోదీ పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు. ఇదిలా ఉంటే ప్రమాదం అంచున ఉన్న ఇళ్లను కూల్చివేస్తోంది ప్రభుత్వం. మంగళవారం నుంచి కూల్చివేతను ప్రారంభించింది. జోషిమఠ్ పట్టణాన్ని మూడు భాగాలుగా విభజించింది. డేంజర్, బఫర్, పూర్తిగా సురక్షితమైన ప్రాంతాలుగా విభజించి కూల్చివేతలు ప్రారంభించింది.

Read Also: Thalapathy Vijay: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న దళపతి విజయ్ కుమారుడు

600పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎక్కువగా దెబ్బతిన్న వాటిని కూల్చేస్తున్నారు. జోషిమఠ్ సమీప ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలను ప్రభుత్వం నిషేధించింది. సుమారు 4000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. జోషిమఠ్ లో పరిస్థితిని అంచనా వేసిన నిపుణుల బృందం ప్రమాదకరంగా మారిన ఇళ్లను కూల్చివేయాలని సిఫారసు చేసింది. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) బృందం పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగనున్నాయి.. వీరికి సహాయం చేయడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF)ని పిలిపించారు.

జోషిమఠ్ ప్రజలు అక్కడ నిర్మితం అవుతున్న ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టు వల్లే తమకు ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టణం కుంగుబాటుకు ఇది కారణం కాదని.. అనేక దశాబ్ధాల క్రితం విరిగిపడిన కొండచరియలపై నిర్మాణాలు కొనసాగడం, అక్కడ ఏటవాటుగా భూమి ఉండటం వల్ల ఈ జోషిమఠ్ కుంగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. బద్రీనాథ్ కు గేట్ వేగా భావించే జోషిమఠ్ పట్టణంలో ఇటీవల కాలంలో భవననిర్మాణాలు, రోడ్ల విస్తరణ పెరిగింది. దీంతో నేల వదులుగా ఉండటంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి.

Exit mobile version