NTV Telugu Site icon

Rahul Gandhi: బీజేపీ విధానాల వల్లే జమ్మూ కాశ్మీర్‌కి ఈ పరిస్థితి.. దోడా ఘటనపై రాహుల్..

Rahul

Rahul

Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు జవాన్లు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. వారికి నివాళులు అర్పించిన రాహుల్, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ఈరోజు, జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రవాద ఎన్‌కౌంటర్‌లో మా సైనికులు అమరులయ్యారు. అమరవీరులకు నా వినయపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను మరియు మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని మంగళవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న దాడులు విచారకరమని, ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.

READ ALSO: Virat Kohli: కోహ్లీ మారిపోయాడు.. ఫోన్ నెంబర్ కూడా తెలియదు! టీమిండియా స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్లో దయనీయ పరిస్థితికి బీజేపీ తప్పుడు విధానాలే కారణమని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పరోక్షంగా ప్రస్తావించారు. పదేపదే భద్రతా లోపాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, దేశభక్తి కలిగిన ప్రతీ భారతీయుడి డిమాండ్ అని ఆయన అన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు రాజకీయ ఐక్యతను ప్రదర్శించాలని చెప్పారు. ఈ విషాద సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ దేశం ఒక్కతాటిపైకి రావాలని కోరారు.

దోడా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఒక అధికారితో సహా నలుగురు సైనికులు మరణించారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన ఆర్మీ, జమ్మాకాశ్మీర్ పోలీసులపై దాడికి తెగబడ్డారు. పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో మాట్లాడారు. కొనసాగుతున్న ఆపరేషన్‌ని సమీక్షించారు. గత వారం కథువా ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు జవాన్లు మరణించిన తర్వాత ఇదే రెండో అతిపెద్ద ఎన్‌కౌంటర్. పూంచ్, రాజౌరీలలో మొదలైన ఈ దాడులు ఇప్పుడు కొన్నేళ్ల క్రితం వరకు ఉగ్రవాదం లేని ప్రాంతం. గత 32 నెలల్లో 48 మంది సైనికులు ఉగ్రదాడుల్లో మరణించారు.