NTV Telugu Site icon

Viral video: బాబోయ్.. ఇవేం కుక్కలు.. బెంబేలెత్తిపోయిన డెలివరీ బాయ్

Dogsviralvideo

Dogsviralvideo

దేశ వ్యాప్తంగా కుక్కలు విజృంభిస్తున్నాయి. ఎక్కడో చోట కుక్కల దాడిలో చిన్న పిల్లల దగ్గర నుంచీ.. పెద్దోళ్లు వరకు గాయపడుతునే ఉంటున్నారు. రోడ్ల మీదకు రావాలంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. రహదారుల ప్రక్కన.. కాచు కూర్చుని అమాంతంగా వాహనదారులపై ఎటాక్ చేస్తున్నాయి. ఇక చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే.. ప్రాణాలు పోయే దుస్థితి ఏర్పడింది. ఈ మధ్య హైదరాబాద్‌లో అయితే బాలుడి ప్రాణాలే పోయాయి. ఈ ఘటనే కాదు.. దేశంలో ఆయా ప్రాంతాల్లో గ్రామ సింహాల మారణహోమానికి ప్రజల ప్రాణాలు బలిపోతున్నాయి. రక్షణ కల్పించాల్సి ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతున్నాయి. అంతా అయిపోయాక.. తీరిగ్గా చర్యలు చేపడుతున్నారు. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వెలుగు చూసిన సంఘటన తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఓ డెలివరీ బాయ్‌ను కండలు.. కండలు ఊడేలా పెంపుడు కుక్కలు పీక్కుతున్నాయి. రక్షించండి.. రక్షించండి అంటూ మొర్ర పెట్టుకున్నా.. కాపాడిన నాథుడే కనిపించలేదు. ఎవరో మాత్రం మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీడియో చూస్తుంటే మాత్రం గుండెలు అదిరిపోతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Vangalapudi Anitha: టీడీపీ, వైసీపీ పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలి..

ఓ వైద్యుడి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేసేందుకు బాయ్ వెళ్లాడు. అంతే అమాంతంగా మూడు పెంపుడు కుక్కలు ఎటాక్ చేశాయి. వాటి నుంచి విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వదలలేదు. దీంతో అతడు కాపాడండి.. కాపాడండి అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్న పట్టించుకున్న పాపాన పోలేదు. కండలు ఊడేలా పీక్కుతున్నాయి. మొత్తానికి ఎలాగోలా వాటి బారి నుంచి బయటపడి.. రోడ్డుపై ఉన్న కారు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే ఎవరో మాత్రం ఈ సంఘటనను మొబైల్‌లో చిత్రీకరించారు. ఈ వీడియోలో ప్యాంట్ చిరుగుపోయింది. కాళ్లు, చేతుల నుంచి రక్తం కారుతున్న దృశ్యాలు కనిపించాయి. అంతా అయిపోయాక.. ఎవరో ఒక వ్యక్తి.. మంచినీళ్లు ఇచ్చాడు.. అనంతరం మరో లేడీ.. రక్తం కారకుండా బట్ట తీసుకొచ్చి కట్టింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. మున్సిపల్ అధికారులపై దుమ్మెత్తిపోస్తున్నారు. కుక్కల యజమానిని జైల్లో పెట్టాలని… వైద్య ఖర్చులతో పాటు.. కుటుంబ పోషణకు నిందితుల నుంచి వసూలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇక బాధితుడు సల్మాన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై కుక్కలు దాడి చేసినా.. ఎవరు పట్టించుకోలేదని వాపోయాడు. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.